ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha ED Enquiry : కవిత ప్రతినిధి ఈడీకి ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో ఏముందంటే.. సరిగ్గా పరిశీలిస్తే..

ABN, First Publish Date - 2023-03-16T17:59:35+05:30

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) విచారణకు రాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఈడీకి లేఖ (Kavitha Letter To ED) రాసిన సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) విచారణకు రాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఈడీకి లేఖ (Kavitha Letter To ED) రాసిన సంగతి తెలిసిందే. తన ప్రతినిధి సోమా భరత్ కుమార్ (Soma Bharath Kumar) ద్వారా ఆ లేఖను కవిత ఈడీకి చేరవేశారు. అయితే ఆ లేఖలో కవిత ఏమేం ప్రస్తావించారు..? ఎందుకు రాలేకపోతున్నానని చెప్పారు..? లేఖతో పాటు తన ప్రతినిధి ద్వారా ఇంకా ఏమేం పంపారు..? అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరైతే కవిత లేఖ నెట్టింట్లో దొరుకుతుందేమో సెర్చ్ కూడా చేస్తున్నారు. అసలు ఆ లేఖ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

లేఖలో ఏముందంటే..?

కవిత ఈడీకి రాసిన లేఖలు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా.. మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను. అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని ఇదివరకే మీకు చెప్పాను. అయితే నా విజ్ఞప్తిని మీరు అంగీకరించలేదు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగాపెట్టి నన్ను ప్రశ్నించాలని చెప్పారు. చట్టప్రకారం నాకు హక్కులు ఉన్నప్పటికీ మీ మాటను అంగీరించి ఈనెల 11న జరిగిన విచారణకు హాజరై పూర్తిగా సహకరించాను. మీరు (ఈడీ అధికారులు) అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చాను. అయినా చట్ట విరద్ధంగా నా ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ నేరంతో నా ఫోన్‌కు ఏం సంబంధమో కూడా చెప్పలేదు. మీ చర్య నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించింది. ఈనెల 11న రాత్రి 8:30 గంటల వరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా (In Person) రావాలని మీరు ఇచ్చిన సమన్లలో ఎక్కడా పేర్కొనలేదు. అందుకే మీరు అడిగిన డాక్యుమెంట్లతో నా ప్రతినిధి సోమా భరత్‌ ద్వారా పంపుతున్నాను. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే 11న మీరు మాట తప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగా విచారించడానికే నేను వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పినా.. అలాంటిదేమీ జరగలేదు. ఎందుకని నేను అడిగిన ప్రశ్నలకు మా ప్లాన్ మార్చుకున్నామని మీ అధికారులు (ఈడీ అధికారులు) చెప్పారు. దీంతో విచారణ చట్టబద్ధంగా జరగలేదని నేను భావిస్తున్నాను. అందుకే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఈ పిటిషన్ ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. కనుక సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు వచ్చే వరకు ఈడీ సమన్ల విషయంలో వేచి ఉండాలి. ఈడీ ముందు మహిళ విచారణకు హాజరుకావడంపై కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. కనుక తదుపరి ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వాయిదా వేయమని కోరుతున్నాను. ప్రజాప్రతినిధిగా, ఒక మహిళగా నాకు ఉన్న హక్కులను హరించరాదు అని ఈడీకి పంపిన లేఖలో కవిత వివరంగా రాసుకొచ్చారు.

ఇప్పుడా పత్రాలెందుకు..!?

ఇవన్నీ ఒక ఎత్తయితే తన ప్రతినిధి సోమా భరత్ ద్వారా కవిత తన బ్యాంక్ స్టేట్మెంట్‌ను (Kavitha Bank Statement) కూడా పంపారు. అయితే స్టేట్మెంట్‌ ఎందుకు పంపారు..? రెండోసారి విచారణకు వచ్చేటప్పుడు కవితను ఈడీ అధికారులే తీసుకురమ్మన్నారా..? లేకుంటే ఎలాగో అడుగుతారు కదా అని కవిత ముందే గ్రహించి పంపారా..? అనే విషయాలు తెలియరాలేదు. లేఖ, బ్యాంక్ స్టేట్మెంట్‌తో పాటు తనకు సంబంధించిన బిజినెస్ వివరాలను (Kavitha Business Details) కూడా కవిత పంపారు. ఇంకా ఇతర డీటైల్స్ ఏమైనా కావాలంటే తన తరపు న్యాయవాదికి సమాచారం ఇచ్చినా.. లేదా మెయిల్ చేసినా పంపుతానని కూడా లేఖలో చాలా క్లారిటీగా కవిత రాసుకొచ్చారు.

ఈ లేఖపై స్పందించిన అధికారులు ఈనెల 20న అనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్‌కు రావాలని మరోసారి కవితకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఇంతవరకూ రియాక్ట్ కాలేదు. దీంతో కవిత ఏం చేయబోతున్నారు..? విచారణకు వెళ్తారా..? యాంటిసిపేటరీ బెయిల్‌కు అప్లయ్ చేసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాత్రికల్లా సీఎం కేసీఆర్ (CM KCR).. న్యాయ నిపుణులతో నిశితంగా చర్చించి ఆ తర్వాత ఈడీకి రిప్లయ్ పంపుతారని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Kavitha ED Enquiry : ఎమ్మెల్సీ కవిత ముందు నాలుగు ఆప్షన్లు.. హైదరాబాద్ వచ్చీ రాగానే...!


******************************

BRS MLC Kavitha : ఆ అరగంట ఏం జరిగింది..?.. కవిత ఈడీ విచారణ హైడ్రామాలో వెలుగులోకి సీక్రెట్ కోణం..!

******************************

Kavitha ED Enquiry Live: విచారణకు రాలేనంటూ ఈడీకి కవిత లేఖ.. ‘నో’ చెప్పిన ఈడీ


******************************

TSPSC Paper Leak : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలు రేణుక ఎవరు.. ప్రవీణ్‌తో పరిచయం ఎలా.. పెద్ద కథే ఉందిగా..!


******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!


******************************

Updated Date - 2023-03-16T18:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising