ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram : నివురుగప్పిన నిప్పులా గన్నవరం.. దేవినేని ఉమా అరెస్ట్.. కనిపించకుండా పోయినా పట్టాభి.. అసలేం జరుగుతోంది..!?

ABN, First Publish Date - 2023-02-20T21:46:24+05:30

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు విధ్వంసకాండ సృష్టించాయి. టీడీపీ కార్యాలయంపై (TDP Office) వైసీపీకి (YSRCP)చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు గూండాల్లా మారి అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు. కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. అయితే.. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు బయల్దేరి వెళ్లారు. అప్పటి వరకూ ఏం జరిగినా సైలెంట్‌గా ఉన్న పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంత రచ్చ చేస్తున్న వైసీపీ కార్యకర్తలను కానీ.. ఒక్క వైసీపీ నేతను కానీ, ఆఖరికీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను కూడా పోలీసులు టచ్ చేయలేదు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం కొందరు అసలు గన్నవరంలో జరిగింది ఇదీ అంటూ పక్కాగా వీడియోలతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోల్లో దాడిచేసే వ్యక్తులను అడ్డుకోవడం, పోలీసులకు కూడా దెబ్బలు తగిలినట్లు ఉన్నాయి.

ఉమా అరెస్ట్..!

ఈ క్రమంలో గన్నవరం టీడీపీ నేతలకు అండగా నిలబడేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఘటనాస్థలానికి వెళ్లారు. ఆయన అక్కడికెళ్లిన నిమిషాల వ్యవధిలోనే దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం, కార్లు తగలపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వాళ్లను అరెస్ట్ చేయాల్సింది పోయి.. తనను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ఉమా ప్రశ్నించారు. అసలు ఆయన మాటలను లెక్కచేయని పోలీసులు బలవంతంగా పోలీసు కారులో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఇంతవరకూ తెలియని పరిస్థితి. ఉమా ఒక్కరే కాదు టీడీపీ నేతలు చాలా మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్లిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావును కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మరోవైపు.. గన్నవరం బయల్దేరిన టీడీపీ నేతలను ఎనేకేపాడువద్ద పోలీసులు అడ్డుకున్నారు.

పట్టాభి ఏమయ్యారు..?

గన్నవరంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అదృశ్యమయ్యారు. టీడీపీ నేత ఇంటిపై దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం వెళ్లిన పట్టాభి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి పట్టాభిని తీసుకెళ్లడం టీడీపీ శ్రేణులు గుర్తించారు. పట్టాభిని తీసుకెళ్లిన వ్యక్తి నిజంగా పోలీసేనా? లేక ఎవరైనా పోలీసు యూనిఫాంలో వచ్చి పట్టాభిని తీసుకెళ్లారా? అనేది టీడీపీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. పట్టాభి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభికి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ శ్రేణులు కన్నెర్రజేస్తున్నారు.

పట్టాభి ఫోన్ స్విఛాప్..!

పట్టాభి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన సతీమణి చందన (Chandana) మీడియా ముందుకొచ్చారు.గన్నవరం పార్టీ కార్యాలయం దాడి విషయం తెలిసి నా భర్త అక్కడికి వెళ్లారు. అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. డ్రైవర్, పీఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.. కానీ నా భర్త అక్కడ లేరు. నా భర్తను పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో తెలియదు. ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తోంది. నా భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీదే బాధ్యత అని మీడియా ముందు చందన కంటతడిపెట్టారు.

మొత్తానికి చూస్తే.. ఇవాళ సాయంత్రం నుంచి గన్నవరం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేదని వల్లభనేని వంశీ చెబుతున్నారు. మరోవైపు.. టీడీపీ నేత చిన్నా కారును వంశీ వర్గీయులు తగలబెట్టడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డు మీదికి వచ్చారు. అయితే.. పోలీసులు కూడా ఇంతవరకూ ఈ ఘటనపై స్పందించిన దాఖలాల్లేవ్. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.

ఇవి కూడా చదవండి..

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

**********************************

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-20T21:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising