Telugudesam : టీడీపీ వైపు మాజీ మంత్రి చూపు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్లాన్.. ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
ABN, First Publish Date - 2023-02-26T22:23:53+05:30
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమకు ఎక్కడైతే గెలుపు అవకాశాలున్నాయో..? ఏ పార్టీ అయితే తమకు టికెట్ ఇస్తుందో..? అని అనుకూల పరిస్థితులను వెతుక్కుంటున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమకు ఎక్కడైతే గెలుపు అవకాశాలున్నాయో..? ఏ పార్టీ అయితే తమకు టికెట్ ఇస్తుందో..? అని అనుకూల పరిస్థితులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి జంపింగ్‌లు చేస్తున్నారు. మరికొందరు ఏపీ బీజేపీకి కీలక నేతలు (BJP Key Leaders) గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇటీవలే మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా ఓ మాజీ మంత్రి కూడా టీడీపీ వైపు చూస్తున్నారట. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అంతేకాదు ఇప్పటికే సొంత నియోజకవర్గంతో పాటు మరో కీలక నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు..? ఎక్కడ్నుంచీ పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇదిగో ఈయనే..!
ఆ మాజీ మంత్రి మరెవరో కాదండోయ్.. సీనియర్ నేత ఆది నారాయణరెడ్డి (Adinarayana Reddy). ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఈయన ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆదినారాయణ రెడ్డి.. 2004, 2009 ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YSR) విధేయుడిగా ఉన్న ఆది.. వైసీపీ స్థాపన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో కండువా కప్పుకున్నారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ మూడు సార్లు కూడా ఆదినారాయణరెడ్డి గెలిచింది రామసుబ్బారెడ్డిపైనే (Rama Subbareddy). 2014లో గెలిచిన తర్వాత వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టఫ్ ఉన్నప్పటికీ బీటెక్ రవిని (Btech Ravi) గెలిపించుకుని జగన్ ఇలాఖాలో ఆది తన సత్తా ఏంటో చూపించారు. దీంతో జిల్లాలో టీడీపీ ప్రాబల్యం పెంచుకోవాలని భావించి కడప జిల్లాగా నేతగా ఉన్న ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడిక ఆయన మరింత జోష్‌తో పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అయితే.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా కడప జిల్లా ఎంపీగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. పైగా టీడీపీ అధికారంలోకి రాకపోవడం, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) ఆదినారాయణపై ఆరోపణలు రావడంతో సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి వరకూ ఒంటికాలిపై లేచిన ఆది.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఇబ్బందులు తప్పవని భావించి జాతీయ పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లో అందరూ అనుకున్నారట. ఈయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి కూడా టీడీపీకి టాటా చెప్పి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకున్నారు.
బీజేపీ నుంచి టీడీపీ వైపు..!
సీనియర్ నేతగా ఉన్న ఆది బీజేపీలో (BJP) చేరినప్పటికీ ఆయన్ను పట్టించుకునే నాథుడు లేరని మొదట్నుంచీ వార్తలు వస్తున్నాయి. పైగా రాయలసీమలో (Rayalaseema) బీజేపీ ఏ మాత్రం బలోపేతం కాకపోవడంతో ఇక రానున్న ఎన్నికల్లో కమలం పార్టీ తరఫున పోటీ చేయడమే కష్టమని భావించిన ఆయన.. సొంత గూటికి చేరాలని భావిస్తున్నారట. మార్చి నెల చివరికల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవాలని అనుచరులతో మాట్లాడుకుంటున్నారట. పార్టీలో చేరడం వరకూ ఓకే.. టికెట్ దక్కుతుందా లేదా అనేది సందేహమేనట. ఎందుకంటే.. ఆదినారాయణరెడ్డి అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పినా ఆయన సోదరుడు మాత్రం సైకిల్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పైగా.. అన్న కుమారుడు భూపేష్ జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేయాలని విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ (Jammalamadugu Ticket) వచ్చే ఆశల్లేనట్లే. అందుకే అయితే జమ్మలమడుగు లేకుంటే మరొకటి అని ముందుగానే పొద్దుటూరు (Proddatur) టికెట్‌ను అడగాలని భావిస్తున్నారట. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా చేరవేశారని తెలియవచ్చింది. అయితే.. కడప జిల్లా (YSR Kadapa) టీడీపీ అధ్యక్ష పదవి, పొలిట్ బ్యూరో స్థానం కూడా ఇవ్వాలని ఆదినారాయణ అడుగుతున్నట్లు తెలుస్తోంది. పొద్దుటూరులో టీడీపీ టికెట్ కోసం చాలా రోజులుగానే సీనియర్ల మధ్య పెద్ద గొడవే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన అక్కడికెళ్తే ఎలా ఉంటుందో ఏంటో మరి.
మొత్తానికి చూస్తే.. మొదటిసారి ఎన్నికల్లో పోటీచేయాలని అబ్బాయ్ భూపేష్ అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబాయ్ ఎంట్రీ ఇస్తే ఏమవుతుందో మరి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకవేళ బీజేపీ-టీడీపీ (BJP-TDP) పొత్తు ఉంటే మాత్రం పార్టీ మారకూడదని కూడా నిర్ణయించారట. రానున్న ఎన్నికలు టీడీపీకి చాలా కీలకమే.. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరగొచ్చేమో..!
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
******************************
Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!
******************************
Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో
******************************
TS Congress : ‘కోమటిరెడ్డి ఎవడు.. నాకు తెలియదు..’ ఎంపీని షబ్బీర్ అలీ ఇంత మాట అనేశారేంటి.. ఎందుకింత రచ్చ..!?
******************************
Viveka Murder Case : పీకలదాకా వచ్చేసరికి సిల్లీ లాజిక్స్ ఏంటి సజ్జలా.. అసలేంటీ మాటలు.. నవ్వుకుంటున్నారు బాబోయ్..!
******************************
Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!
Updated Date - 2023-02-26T22:44:36+05:30 IST