ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Shivakumar: అంత కష్టపడ్డ డీకేకు హస్తం పార్టీ హ్యాండ్ ఇవ్వడానికి కారణాలు ఇవన్నమాట..!

ABN, First Publish Date - 2023-05-17T13:03:52+05:30

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కాంగ్రెస్ హైకమాండ్ పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్యపేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి (Karnataka CM) ఎవరనే విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే (Siddaramaiah) కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. గురువారమే (May 18, 2023) సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందింది.

డీకే శివకుమార్‌తో (DK Shiva Kumar) కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు. డీకే శివకుమార్‌కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. సోనియా, రాహుల్‌తో సిద్ధరామయ్య భేటీ అయిన అనంతరం సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపినట్లు జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అనుభవానికే పెద్దపీట వేసింది. సిద్ధరామయ్యకు అనుభవం కలిసొచ్చింది. ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్ధరామయ్యకే ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ మాజీ ముఖ్యమంత్రి వైపే నిలిచింది. డీకే శివకుమార్‌కు పలు కేసులు అడ్డంకిగా మారాయి. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు డీకే చెప్పిన ఎమ్మెల్యేలకు విద్యుత్, నీటిపారుదల శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య పేరు ముఖ్యమంత్రిగా దాదాపుగా ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అభిమానులు సిద్ధరామయ్య ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్యతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో మంగళవారం విడివిడిగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. తొలుత డీకే శివకుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. పార్టీకి తాను వీర విధేయుడినన్నారు. కాంగ్రెస్‌ తనకు తల్లిలాంటిదన్నారు. వెన్నుపోటు పొడిచే ఆలోచన తనకు లేదన్నారు. సిద్దరామయ్య కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీకు తెలిసినవే కదా అంటూ ఖర్గేతోనూ నవ్వుతూనే ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడ్డంతో మతోన్మాద బీజేపీని దూరంగా ఉంచాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జేడీఎ్‌సతో చేతులు కలిపి బేషరతుగా ముఖ్యమంత్రి పదవిని అప్పగించామని, అయితే 2019 నాటికి పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఆపరేషన్‌ కమల వలలో చిక్కుకోవడం వెనుక రాజకీయ అదృశ్య హస్తం మీకు ఉందనిపించడం లేదా..? అంటూ ఆయన ఖర్గేను ప్రశ్నించినట్టు తెలిసింది. 14 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఏ మాత్రం వెరవక గత మూడేళ్లుగా ఎంతో శ్రమకోర్చి పార్టీని ముందుకు నడిపించానని ఖర్గే ముందు తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఒక్కలిగ, లింగాయత కులాలు కాంగ్రెస్ వైపు మళ్లేలా చేయడంలోనూ రాజకీయ వ్యూహాలను అమలు చేశానని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటే ఈ కులాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉండేలా చూడాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం పైనే ఉందన్నారు. ముస్లిం మైనారిటీలు, దళితులు మొదటి నుంచి కాంగ్రెస్‌కు బాసటగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సిద్దరామయ్య ప్రభావాన్ని ప్రజల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను తాను తక్కువ చేసి చూపడం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడ్డానని శ్రమకు తగ్గ ఫలం దక్కాలని కోరుతున్నానన్నారు. డీకే శివకుమార్‌ వాదనను సావధానంగా ఆలకించిన ఖర్గే ఆయనను సాగనంపిన అనంతరం సిద్దరామయ్యతో భేటీకి సిద్ధం కావడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడబోనని ఖర్గేకు భరోసా ఇచ్చారు.

డీకే శివకుమార్ ఈ భరోసా ఇవ్వడంతో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే.. ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యేగానే మిగిలిపోతానన్న డీకే శివకుమార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు, ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా సీఎం ఎంపిక ఉండాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భావించడమే సిద్ధూకు కలిసొచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కులాల సమీకరణలో భాగంగా బలమైన నేతకే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.

Updated Date - 2023-05-17T13:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising