ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roja Selvamani: అప్పుడు చెత్త నటుడు అని విమర్శ.. ఇప్పుడు ఆయన డైలాగ్‌తో ఎలివేషన్‌లు

ABN, First Publish Date - 2023-08-30T13:35:48+05:30

హీరో రజినీకాంత్‌ చెత్త నటుడు అని.. ఆయన ఒక జీరో అని గతంలో వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబును పొగుడ్తూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా స్వయంగా ఖండించారు. రజినీకాంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఆయన మాటలకు విలువ లేదని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తమ పార్టీ అధినేత జగన్‌కు మంత్రి రోజా ఎలివేషన్‌లు ఇస్తున్నారు.

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో నోటి దురుసు ఉన్న మంత్రుల జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. గతంలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు ప్రతిపక్షాలపై నోటి దురుసుతో రెచ్చిపోయేవాళ్లు. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా వీళ్లకు రెండోసారి మంత్రి పదవులు దక్కలేదు. వీళ్ల స్థానంలో రోజా వచ్చి చేరింది. ఆమెకు మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి నోటితో మరింత రెచ్చిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. జబర్దస్త్‌లో డైలాగులన్నీ ప్రెస్‌మీట్లలో చెప్పడం పలు సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గతంలో తమిళ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించడంతో పాటు ఏపీ ప్రభుత్వంపై ఏదో విమర్శలు చేశారని వైసీపీ మంత్రులందరూ తమ నోటికి పనిచెప్పారు. ఈ జాబితాలో మంత్రి రోజా కూడా ఉన్నారు.

ఆనాడు హీరో రజినీకాంత్‌ చెత్త నటుడు అని.. ఆయన ఒక జీరో అని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబును పొగుడ్తూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా స్వయంగా ఖండించారు. రజినీకాంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. ఆయన మాటలకు విలువ లేదని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని తమ పార్టీ అధినేత జగన్‌కు మంత్రి రోజా ఎలివేషన్‌లు ఇస్తున్నారు. జైలర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో భాగంగా.. హీరో రజినీకాంత్ మాట్లాడుతూ.. మొరగని కుక్కే లేదు.. విమర్శించని నోరే లేదు.. ఈ రెండు లేని ఊరే లేదు.. అర్ధమైందా రాజా అని అభిమానులకు చెప్పారు. అంటే తమను విమర్శించే వాళ్లను లైట్ తీసుకోవాలని ఆయన సూచించారు.


ఇప్పుడు రజినీకాంత్ చెప్పిన డైలాగ్‌ను మంత్రి రోజా తన అవసరానికి వాడేసుకున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ పర్యటించగా.. ఆయనకు ఎలివేషన్ ఇచ్చేందుకు రజనీకాంత్ చెప్పిన డైలాగ్ తనకు గుర్తుకువచ్చిందని రోజా చెప్పారు. దీంతో హీరో రజినీకాంత్ విషయంలో కొద్దిరోజుల్లోనే మంత్రి రోజా ప్లేట్ ఫిరాయించారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. తమ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను తట్టుకోలేక రజినీకాంత్ డైలాగ్‌ను మంత్రి రోజా వాడుకున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. రాజకీయాల్లో రెండు నాలుకల ధోరణితో మాట్లాడటం వైసీపీ నేతలకే చెల్లిందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. తమకు నచ్చితే ఒకలా.. నచ్చకపోతే ఒకలా ప్రొజెక్ట్ చేయడం వైసీపీ నేతలకు అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ చేసేది రాజకీయం కాదని నీచకీయం అని పలువురు రజినీకాంత్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

Updated Date - 2023-08-30T13:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising