ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : రాజగోపాల్ రెడ్డి చేరికపై ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABN, First Publish Date - 2023-10-25T17:09:52+05:30

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమలం పార్టీకి బై బై చెప్పేసిన ఆయన.. కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని లేదంటే తానే గజ్వేల్‌లో పోటీ చేసి ఓడిస్తానని సవాల్ చేశారు. 100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి దుర్మార్గంగా మునుగోడు బై ఎలక్షన్‌లో తనను బీఆర్ఎస్ ఓడించిందని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్నారు. అధికార బీఆర్ఎస్‌ను (BRS) గద్దె దించడమే తన లక్ష్యమని.. అందుకే కాంగ్రెస్‌లోకి మరలా వచ్చినట్లు రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. సోదరుడి చేరికపై మీడియాతో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatir Reddy Venkata Reddy) సడన్ ట్విస్ట్ ఇచ్చారు.


నిజం.. నాకు తెలియదు!

కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్ అధిష్టానానిదే నిర్ణయం. నాతో ఎటువంటి చర్చ జరపలేదు. ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనిదే హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. టికెట్లపై హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నా సోదరుడే కాదు చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కర్ణాటక (Karnataka)లో హామీ ఇచ్చిన పథకాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఈ రోజు పూర్తవుతుంది.. జాబితా రేపు విడుదల అవుతుంది. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారుఅని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్‌తో కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. సొంత తమ్ముడు.. అదీ సొంత పార్టీలోకి వస్తున్న విషయం తెలియకపోవడం ఏంటి..? అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

తక్కువేం కాదే..!

సీఈసీ (CEC) ఫైనల్ అయ్యేవరకు టికెట్ల గురించి బయట మాట్లాడకూడదు. గతంలోనే కాళేశ్వరం (Kaleswaram)పై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాశాం. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువేం కాదు. మిర్యాలగూడలో కూడా అడిగారని, అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయి. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుంది. యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేరు చెప్పే అర్హత కేటీఆర్‌ (KTR)కు లేదు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదని, ఇప్పుడు కేటీఆర్ ఆస్తులెంత..?. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-25T17:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising