YCP MP RaghuRama: జగన్‌కు ఎంపీ రఘురామ ఓపెన్ ఛాలెంజ్
ABN, First Publish Date - 2023-03-04T23:08:02+05:30
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Rebel MP Raghuramakrishna Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (YCP Rebel MP Raghuramakrishna Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ లాగా పెట్టుబడుల పేరుతో స్థల క్యాప్చరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కోసం 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలంటే మళ్లీ తానే ఎన్నికల్లో గెలవాలని జగన్ అనుకుంటున్నారని రాఘురామ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చేలోపు కొన్నిటికైనా స్థలాలు ఇస్తారని.. స్థలయజ్ఞం అయితే కచ్చితంగా జరుగుతుందని ఎంపీ అన్నారు. జగన్‌కు తాను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu RamaKrishnaraju) స్పష్టం చేశారు. స్థలం ఎక్కడ సృష్టించి పెట్టుబడిదారులకు ఇవ్వగలరని, తమ దగ్గర ఉన్నది 45 వేల ఎకరాలైతే.. 7 లక్షల ఎకరాలు ఎలా సృష్టించి ఇస్తారని రఘురామ ప్రశ్నించారు. తమ దగ్గర ఉన్న 45 వేల ఎకరాల భూమిని లక్షల మెగావాట్లకు ఎలా సర్దుతారని ప్రశ్నించారు. 'ఒకవేళ స్థలం సేకరించాలంటే.. ఎవరి స్థలాలు తీసుకొని.. ఎవరికి ఇస్తారు' అని ఎంపీ ప్రశ్నించారు. 450 కోట్లు స్మాల్ అండ్ మీడియమ్ స్కేల్ ఇండస్ట్రీస్‌కు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సింది 2 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు.
Updated Date - 2023-03-04T23:27:17+05:30 IST