YS Jagan UK Trip: కూతురి పేరుతో జగన్నాటకం.. యూకే వెళ్లింది అందుకోసమేనా?
ABN, First Publish Date - 2023-09-04T21:20:05+05:30
పశ్చిమ కరేబియన్ సముద్రంలో ట్యాక్స్ ఫ్రీ దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐల్యాండ్‌లో నగదు నిల్వ చేయాలంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగతంగా ఎంత డబ్బు అయినా ఈ బ్యాంక్‌లో దాచుకునే సౌకర్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ యూకే పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీ సీఎం జగన్ ఇప్పుడు యూకే పర్యటనలో ఉన్నారు. తన కుమార్తెను చూసేందుకు వెళ్తున్నానంటూ సీబీఐ కోర్టులో అనుమతి తీసుకుని జగన్ యూకే వెళ్లారు. అయితే ఇప్పుడు జగన్ యూకే పర్యటనలో గండికోట రహస్యం దాగి ఉందని వార్తలు వస్తున్నాయి. అక్కడ కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ సమావేశం అవుతున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏబీఎన్ లైవ్‌లో ఆరోపించారు. ప్రస్తుతం ప్రత్యేక స్వయం ప్రతిపత్తి దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉంది. అంతేకాకుండా ప్రపంచానికి ఫైనాన్షియల్ సెంటర్‌గా కూడా కేమ్యాన్ ఐలాండ్స్ వ్యవహరిస్తోంది.
పశ్చిమ కరేబియన్ సముద్రంలో ట్యాక్స్ ఫ్రీ దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐల్యాండ్‌లో నగదు నిల్వ చేయాలంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగతంగా ఎంత డబ్బు అయినా ఈ బ్యాంక్‌లో దాచుకునే సౌకర్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ యూకే పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంక్‌లో తన అక్రమ సంపాదన దాచుకునేందుకే జగన్ యూకే వెళ్లారని కొందరు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ బ్యాంకులో దాచుకున్న డబ్బును తెచ్చుకునేందుకే వెళ్లారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈనెల 12 వరకు యూకే పర్యటనలోనే సీఎం జగన్ ఉండనున్నారు. సీఎం హోదాలో ఉండి కుమార్తెను చూసేందుకు అన్నిరోజులు యూకే పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నెటిజన్‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక, అక్రమ లావాదేవీల కోసమే జగన్ యూకే వెళ్లారని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు
మరోవైపు ప్రభుత్వ ధనాన్ని సీఎం జగన్ వృథా ఖర్చు చేస్తున్నారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకే పర్యటనకు వెళ్లాలంటే అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చి.. ఇక్కడి నుంచి యూకేకు ఫస్ట్ క్లాస్‌లో వెళ్లే అవకాశం ఉందని.. కానీ తన కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసుకుని జగన్ యూకేకు వెళ్లారని కొందరు మండిపడుతున్నారు. అదే సమయంలో ఇటీవల రెండు కి.మీ కోసం హెలికాప్టర్ వాడిన ఘనత జగన్‌కే దక్కుతుందని నెటిజన్‌లు ఎద్దేవా చేస్తున్నారు. అటు నిజంగా కూతురిపై ప్రేమ ఉంటే.. ఆమెను ఇక్కడకి రప్పించలేరా.. ఆమె కోసం జగన్ దంపతులు ప్రభుత్వ ధనంతో యూకేకు వెళ్లాలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా జగన్ యూకే పర్యటనపై వైసీపీ నేతలు స్వయంగా నోరు విప్పితే కానీ అసలు నిజాలు బయటపడే అవకాశాలు లేవు.
Updated Date - 2023-09-04T21:20:05+05:30 IST