కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?

ABN, First Publish Date - 2023-07-04T17:23:33+05:30

అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.

Telugu States BJP : ఏపీలో కిరణ్ రెడ్డికి.. తెలంగాణలో ఈటలకు కీలక పదవులు.. ఈ ఇద్దరికే ఎందుకంటే..!?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పక్కనెట్టి కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డికి (Kishan Reddy) అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అయితే బండిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఏపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని (Daggubati Purandeswari) ఎవరూ ఊహించని రీతిలో నియమించడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే తెలంగాణ నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (Etela Rajender) .. ఏపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి (Kiran Kumar Reddy) బీజేపీ అధిష్టానం కీలక పదవులు ఇచ్చింది. ఈ ఇద్దరికి పదవులు ఏంటి..? తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి ఈ ఇద్దర్నే ఎందుకు నియమించింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

bjp.jpg

కీలక పదవులు ఏమిటంటే..

ఎన్నికల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను (Assembly Elections) దృష్టిలో పెట్టుకుని సంస్థాగతంగా బీజేపీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చడమే కాకుండా పలువురు సీనియర్లకు ప్రమోషన్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా.. కిరణ్ కుమారెడ్డికి బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా, ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కీలక పదవులను కట్టబెట్టింది. అయితే ఈ ఇద్దర్నీ కీలక పదవులు వరించడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ ఈ ఇద్దరి గురించే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వాస్తవానికి బీజేపీలో కీలక పదవులు పొందాలంటే కచ్చితంగా ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉండాల్సిందేనని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఈటల, కిరణ్ రెడ్డికి ఆ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ కీలక పదవులు వరించడంతో హాట్ టాపిక్ అయ్యారు.

ఈటలకే ఎందుకిచ్చారంటే..!

బీఆర్ఎస్‌లో పరిస్థితులు అనుకూలించక.. తిరుగుబాటు చేసిన ఈటల రాజేందర్ ‘కారు’ (బీఆర్ఎస్) దిగి.. కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. తనకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ హుజురాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి నిలిచారు. ఆ మరుసటి రోజు నుంచే ఈటలకు కీలక పదవి ఇస్తారని టాక్ నడిచింది కానీ అదేమీ జరగలేదు. ఉద్యమ నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. వీటన్నింటికీ మించి బీఆర్ఎస్ లోటుపాట్లు బాగా తెలిసిన వ్యక్తిగా.. సీఎం కేసీఆర్‌ను ఢీకొనే ఏకైక నేతగా భావించిన బీజేపీ నాయకత్వం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా రఘునందనరావు, రాజాసింగ్.. ఇంకా చాలా మంది సీనియర్ నేతలు బీజేపీలో ఉన్నప్పటికీ.. ఈటలకు ఇస్తేనే అన్ని విధాలుగా న్యాయం చేస్తారని, కేసీఆర్‌తో ఢీ కొనడానికి ఇతనే కరెక్టని అధిష్టానం భావించింది గనుకే కీలక పదవి కట్టబెట్టినట్లు కూడా మరోవైపు చర్చ జరుగుతోంది. వాస్తవానికి రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే.. అంతకుమించి కీలక బాధ్యతలనే అధిష్టానం కట్టబెట్టింది.

ఏపీ నుంచి ఇంత మంది ఉన్నా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పట్నుంచీ కీలక నేతలు, సీనియర్లు చాలా మందే బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. ముఖ్యంగా.. విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, మాధవ్‌తో పాటు చాలా మంది సీనియర్లు కొన్నేళ్లుగా బీజేపీలోనే ఉంటున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నుంచి కూడా చాలా మందే ముఖ్యనేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అయితే వీరందర్నీ కాదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి.. బీజేపీ హైకమాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించడంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. కిరణ్‌కు స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా.. ఇతర కీలక పదవుల్లో పనిచేసిన అపార అనుభవం ఉంది. ఇంత సుదీర్ఘమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కిరణ్ రెడ్డికి ఈ పదవిని కట్టబెట్టిందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్‌‌లో పనిచేసిన అందరితోనూ ఇప్పటికీ పరిచయాలున్నాయి. పైగా ఆ సినయర్లంతా ఇప్పుడు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌లో కొనసాగుతూ వస్తున్నారు. వారిని పార్టీలోకి రప్పించడానికి.. కిరణ్‌ను అస్త్రంగా ప్రయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాదు.. కోస్తాఆంధ్రతో పోలిస్తే రాయలసీమలో బీజేపీ అంత పట్టులేదు.. ఇప్పుడు కీలక పదవి ఇవ్వడంతో బలోపేతం చేసుకోవచ్చనే ఆలోచన కూడా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూశారుగా.. ఈటల, కిరణ్ రెడ్డికి కీలక పదవులు కట్టబెట్టడం వెనుక ఎంత పెద్ద కథుందో!.

Updated Date - 2023-07-04T17:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising