ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold: బంగారం లాంటి ఉద్యోగం.. లక్షల కొద్దీ జీతం.. అయినా ఇదేం పనయ్యా బాబూ..? బంగారాన్ని పేస్టులా మార్చి చేతికి చుట్టుకుని..!

ABN, First Publish Date - 2023-03-09T15:30:54+05:30

కొందరికి ఎంత డబ్బు, ఎంత ఆస్తి ఉన్నా కక్కుర్తి పనులు చేస్తూ చివరకు అందరిలో నవ్వులపాలవుతుంటారు. ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. అతడు ఎయిరిండియాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతంతో పాటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొందరికి ఎంత డబ్బు, ఎంత ఆస్తి ఉన్నా కక్కుర్తి పనులు చేస్తూ చివరకు అందరిలో నవ్వులపాలవుతుంటారు. ప్రస్తుతం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. అతడు ఎయిరిండియాలో మంచి ఉద్యోగం (Air India Employee) చేస్తున్నాడు. మంచి జీతంతో పాటూ అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అయినా అతడి బుద్ధి పక్కదారి పట్టింది. ఏకంగా బంగారాన్నే పేస్టాలా మార్చాడు. చివరకు దాన్ని చేతికి చుట్టుకున్నాడు. అంతా ఇతన్ని చూసి, ఇదేం పనయ్యా బాబూ..? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కేరళలోని వాయనాడ్ (Kerala Wayanad) ప్రాంతానికి చెందిన షఫీ అనే యువకుడు.. కొచ్చి ఎయిర్‌పోర్టులో (Kochi Airport) బహ్రెయిన్ కోజికోడ్ కొచ్చి సర్వీస్ ఎయిరిండియా (Air India) క్యాబిన్ క్రూ సభ్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి మంచి జీతంతో పాటూ సకల సౌకర్యాలూ ఉన్నాయి. అయితే ఇతడు చేసిన కక్కుర్తి పని.. చివరకు ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. బుధవారం ఇతను చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. సుమారు కిలోకి పైగా బంగారాన్ని పేస్టులా మార్చాడు. దాన్ని రెండు చేతులకూ చుట్టుకున్నాడు. ఎలాగైనా ఆ బంగారాన్ని ఎయిర్‌పోర్టు దాటించాలని (Gold smuggling) ప్లాన్ చేశాడు. రోజూ బంగారాన్ని తరలించే వారిని చూసి చూసి.. భిన్నంగా తరలించాలని ఈ ఎత్తుగడ వేసినట్టుంది.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

రెండు చేతులకూ బంగారాన్ని చుట్టి, పైన షర్ట్ కవర్ చేసుకున్నాడు. దీంతో ఇతడిపై ఎవరికీ అనుమానం రాలేదు. గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్లిపోవాలని అనుకున్నాడు. అయితే చివరగా కస్టమ్స్ అధికారులకు (Customs officials) పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతన్ని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇదిలావుండగా, చెన్నై విమానాశ్రయంలోనూ (Chennai Airport) బుధవారం బంగారు తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. వీరు సింగపూర్ (Singapore) నుంచి వచ్చినట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ.3.32కోట్ల విలువైన 6.8కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇంజెలిజెన్స్ సమాచారంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-09T15:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising