Bollywood actress: పన్ను బకాయిపై ఐశ్వర్యరాయ్‌కు నోటీసు
ABN , First Publish Date - 2023-01-18T12:21:15+05:30 IST
బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పన్ను ఎగవేతదారా?...

ముంబయి:బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పన్ను ఎగవేతదారా? అవునంటున్నారు నాసిక్ మున్సిపల్ అధికారులు. నాసిక్‌లో భూమి పన్ను చెల్లించనందుకు ఐశ్వర్యరాయ్‌కు(Bollywood actress) నోటీసు జారీ చేశారు.ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు(Aishwarya Rai Bachchan) నాసిక్‌లోని(Nashik land) అద్వాడి గ్రామంలో ఉన్న ఒక హెక్టార్ భూమికి గాను రూ.21,960 పన్ను చెల్లించనందుకు నోటీసు జారీ చేశారు.(Notice for unpaid tax)
బకాయి మొత్తాన్ని 10 రోజులలోపు చెల్లించాలని నోటీసులో కోరారు. ఐశ్వర్యారాయ్ న్యాయ సలహాదారులు తమను కలిశారని, పన్ను చెల్లిస్తామని చెప్పారని సిన్నార్ తహసీల్దార్ ఏక్‌నాథ్ బంగాలే పేర్కొన్నారు. తాము ఐశ్వర్యారాయ్ కు రెండుసార్లు డిమాండ్ నోటీసులు పంపించినా స్పందన లేదని దీంతో మళ్లీ జనవరి 9 న పన్ను చెల్లించాలని నోటీసు పంపామని అధికారులు చెప్పారు.