Viral Video: ``మాయ ఎవరు?``.. పెళ్లి పీటలపై వధువుకు అనుమానం.. వరుడి రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-07-30T10:29:23+05:30 IST

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహ వేడుకల కాస్త సుదీర్ఘంగా సాగుతాయి. వధూవరుల దాంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న వధూవరులతో పెద్దలు తమ అనుభవాలను పంచుకుంటారు. పురోహితుడు నీతి కథలు చెబుతాడు.

Viral Video: ``మాయ ఎవరు?``.. పెళ్లి పీటలపై వధువుకు అనుమానం.. వరుడి రియాక్షన్ ఏంటంటే..

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహ వేడుకలు (Wedding) కాస్త సుదీర్ఘంగా సాగుతాయి. వధూవరుల దాంపత్య జీవితం సాఫీగా సాగాలని కోరుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న వధూవరులతో పెద్దలు తమ అనుభవాలను పంచుకుంటారు. పురోహితుడు (Pundit) నీతి కథలు చెబుతాడు. ఇటీవల జరిగిన ఓ పెళ్లిలో పురోహితుడు దాంపత్య జీవితం గురించి, జీవితంలోని ``మాయ`` గురించి చెప్పాడు. ఆ సమయంలో వధువు (Bride)కు వచ్చిన డౌట్ నవ్వులు పూయిస్తోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో కొత్త జంట కళ్యాణ మండపంలో కూర్చుని ఉండగా వారి చుట్టూ బంధువులు నిలబడి పురోహితుడు చెబుతున్నది శ్రద్ధగా వింటున్నారు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి ``మాయ`` అనేది చాలా ముఖ్యమైనదని, ``మాయ`` లేకుండా ఏమీ చేయలేమని పురోహితుడు చెబుతున్నాడు. పురోహితుడు చెబుతున్నదాంతో వరుడు (Groom) కూడా ఏకీభవించాడు. ఆ సమయంలో వధువుకు ఓ డౌట్ వచ్చింది. ఆమె వరుడి వైపు తిరిగి ``మాయ కౌన్ హై`` (మాయ ఎవరు?) అని ప్రశ్నించింది. వరుడు వెంటనే స్పందించి, ``డబ్బు`` (Money) అని చెప్పాడు.

Shocking: 10 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి.. ఆస్పత్రి ఆవరణలో భార్యకు ఎలా కనిపించాడంటే.. వైరల్ అవుతున్న కన్నీటి కథ!

ఆ తర్వాత వధువు, వరుడు, చుట్టు పక్కల వారు పగలబడి నవ్వుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. weddingz.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``మాయ అంటే ఎవరో అమ్మాయి అనుకున్నట్టు ఉంది``, ``వెరీ ఫన్నీ``, ``జీవితంలో డబ్బుకు ఉన్న విలువ దేనికీ లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-30T10:29:23+05:30 IST