ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అవాక్కైన ఆనంద్ మహీంద్ర.. బొలెరో కారు రైల్వే ట్రాకుపై పరుగులు తీస్తే..!

ABN, First Publish Date - 2023-03-29T15:31:14+05:30

వినూత్న ప్రయోగాలు చేసే వారిని మరింత ఎంకరేజ్ చేసి, వారికి అన్ని విధాలా అండగా ఉండడంలో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఎప్పుడూ ముందుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుత ఆవిష్కరణలు చేసే వారిని ప్రశంసిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వినూత్న ప్రయోగాలు చేసే వారిని మరింత ఎంకరేజ్ చేసి, వారికి అన్ని విధాలా అండగా ఉండడంలో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ఎప్పుడూ ముందుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుత ఆవిష్కరణలు చేసే వారిని ప్రశంసిస్తూ.. సదరు వీడియోలను తన సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేస్తుంటారు. అలాంటి ఆయన్నే ఓ వీడియో.. అవాక్కయ్యేలా చేసింది. తన కంపెనీకి చెందిన బొలెరో వాహనం రైల్వే ట్రాక్‌పై పరుగులు తీయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu and Kashmir) చీనాబ్ నదిపై (Chenab River) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈఫిల్ టవర్ (Eiffel Towe) కంటే ఈ వంతెన ఎత్తు ఎక్కువగా ఉంటుందన్నమాట. వంతెనపై ప్రస్తుతం రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించేందుకు గాను బొలెరో వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఆ వాహనాన్ని రైల్వే పట్టాలపై నడిచేలా డిజైన్ చేయించారు. ఇటీవలే వాహనాన్ని రైల్వే ట్రాక్‌పై (Railway track) ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. ఇదేం పని..? బాత్రూంలోకి పామును తీసుకెళ్లి మరీ ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే..!

రాజేంద్ర బి అక్లేకర్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా (Twitter account) ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్రా.. ఆనందం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మహీంద్రా వ్యవస్థాపకులు రహదారి లేని చోటికి వెళ్లేలా వాటిని తయారు చేశారు’’.. అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ వీటిని ఎప్పటికీ తన వద్దనే భద్రపరచుకుంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో (Viral video) నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

World's longest Python: అమ్మ బాబోయ్.. ఇదేంటి ఇంత పొడవుంది..? నేరుగా ఇంట్లోకి దూరిన కొండచిలువ..!

Updated Date - 2023-03-29T15:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising