ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. జనాలను ఏమార్చేందుకు నయా ప్లాన్.. ఫోన్‌ చేసి ఇలా మాట్లాడితే అస్సలు నమ్మొద్దు..!

ABN, First Publish Date - 2023-08-02T21:00:15+05:30

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. నేరగాళ్లు అతి తెలివితో వ్యవహరిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఎలాంటి వారినైనా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. నేరగాళ్లు అతి తెలివితో వ్యవహరిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఎలాంటి వారినైనా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా, గురుగ్రామ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫోన్లో నేరగాళ్లు చెప్పింది విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8.34 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

గురుగ్రామ్ (Gurugram) హౌసింగ్ బోర్డ్ సోసైటీకి చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వారు తమని తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch) అధికారిగా పరిచయం చేసుకున్నారు. ‘‘మీ పేరుతో విదేశాల నుంచి ఓ పార్శిల్ వచ్చింది. అందులో డ్రగ్స్‌తో (Drugs) పాటూ విదేశీ కరెన్సీ కూడా ఉంది’’.. అని చెప్పారు. యువకుడి బ్యాంకు వివరాలు చెక్ చేయాలని బెదిరించారు. అలాగే అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో వారి గుర్తింపు కార్డులను కూడా పంపించారు. వాటిని చూడగానే సదరు యువకుడు నిజమని నమ్మాడు. దీంతో తనను ఎలాగైనా కాపాడాలంటూ వారిని వేడుకున్నాడు. కేసుల నుంచి తప్పించాలంటే తాము అడిగిన మొత్తం పంపించాలని చెప్పారు.

Money: పేపర్ ముక్కలు కాదండోయ్.. కరెన్సీ నోట్లే.. ఓ వృద్ధురాలు కష్టపడి రూ.5.40 లక్షలను దాచుకుంటే..!

దీంతో చివరకు సదరు వ్యక్తి.. వారికి రూ.8.40లక్షలను బదిలీ చేశాడు. డబ్బులు వేయగానే సైబర్ నేరగాళ్ల (Cyber criminals) నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ, ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోయాయని తెలిపారు. గుర్తు తెలియని వారు ఫోన్లు చేసి ఏం చెప్పినా నమ్మొద్దని సూచిస్తున్నారు. ఇదిలావుండగా, ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కంపెనీ అయిన zerodha సీఈవో, సహ వ్యవస్థాపకుడైన నితిన్ కామత్.. ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును షేర్ చేశాడు. తన కంపెనీలో పని చేసే ఉద్యోగి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎలా చిక్కాడో వివరించాడు. కామత్ ఫెడెక్స్, బ్లూడార్ట్ తదితర కొరియర్ కంపెనీల పేరుతో వివిధ రకాల స్కామ్‌లు జరుగుతున్నాయని చెప్పారు. తన కంపెనీ ఉద్యోగి పేరుతో పార్శిల్‌ డ్రగ్స్ వచ్చిందనే నెపం చూపి డబ్బులు బదిలీ చేయించుకున్నారని, ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

World's Richest Woman: అంబానీ కాదు.. ఆదానీ కూడా కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈమేనట.. ఆస్తి ఎంతో తెలిస్తే..!

Updated Date - 2023-08-02T21:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising