ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: లాటరీలో మీ కొడుకు కారు గెలిచాడంటూ... ఫోన్ రావడంతో ఎగిరి గంతేసిన పోలీసు.. కాసేపాగి ఫోన్ చూసుకుని..

ABN, First Publish Date - 2023-10-15T21:58:51+05:30

అపరిచితవ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చిన సందర్భాల్లో చాలా మంది వారు చెప్పే మాటలను నమ్మేస్తుంటారు. ఇక అవతలి వారు అమ్మాయిలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇలాంటి...

ప్రతీకాత్మక చిత్రం

అపరిచితవ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చిన సందర్భాల్లో చాలా మంది వారు చెప్పే మాటలను నమ్మేస్తుంటారు. ఇక అవతలి వారు అమ్మాయిలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ చివరకు దారుణంగా మోసపోతుంటారు. ఇలాంటి మోసాలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. మోసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీసుకు వింత సమస్య వచ్చింది. లాటరీలో మీ కొడుకు కారు గెలిచాడంటూ... ఫోన్ రావడంతో అతను ఎంతో సంతోషించాడు. చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బందా ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇదే ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్‌గా (Police Constable) విధులు నిర్వర్తిస్తుంటాడు. నిత్యం వివిధ రకాల కేసులను చూసే ఇతనే.. ఇటీవల ఊహించని సమస్యలో చిక్కుకున్నాడు. ఓ రోజు అతడికి కొందరు ఫోన్ చేసి.. ‘‘మీ కొడుకు లాటరీలో సఫారీ కారు గెలిచాడు’’.. అని చెప్పడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే కారును పొందేందుకు గానూ కానిస్టేబుల్ నుంచి ఆధార్, బ్యాంకు తదితర వివరాలు (Bank Details) మొత్తం తెలుసుకున్నారు. కారును ఇంటికి పంపిస్తామని చెప్పి ఫోన్ పెట్టేశారు.

Viral: నేను నిన్ను కలవాలంటూ.. రాత్రి 10 గంటలకు డేటింగ్ యాప్ ప్రేయసి ఫోన్.. ఇంట్లోనే మందు పార్టీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

అయితే ఫోన్ పెట్టేసిన కొద్ది సేపటి తర్వాత అతడి అకౌంట్ నుంచి రూ.82వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఖంగుతిన్నాడు. తిరిగి అపరిచిత వ్యక్తులకు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని.. లబోదిబోమంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణలో అపరితవ్యక్తులు జార్ఖండ్‌లోని బొకారో ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి ఫోన్లు వచ్చినా.. మీ వివరాలు తెలియజేయవద్దని సూచించారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే.. వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

Updated Date - 2023-10-15T21:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising