Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!

ABN , First Publish Date - 2023-06-28T10:54:13+05:30 IST

అటు బరువు తగ్గస్తూ, ఇటు పోషకాలు అందించడంలో గుడ్లు, పనీర్ మంచివని నమ్ముతారు. అయితే గుడ్లు, పనీర్ లలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ అంటే..

Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!

అధిక బరువు నేటితరాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఒకే చోట కూర్చుని పనిచేయడం, బయటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల చాలా తొందరగా బరువు పెరుగుతారు. మరికొందరికి హార్మోన్ సమస్యలు కూడా ఉంటాయి. కారణాలు ఏవైనా బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడతుంటారు. చాలామంది బరువు తగ్గించుకోవడానికి ఆహారాన్ని నియంత్రిస్తుంటారు. అయితే ఆహారాన్ని నియంత్రణలో పెట్టినా శరీరానికి సరిపడినంత పోషకాలు అవసరమవుతాయి. అటు బరువు తగ్గస్తూ, ఇటు పోషకాలు అందించడంలో గుడ్లు, పనీర్ మంచివని నమ్ముతారు. అయితే గుడ్లు, పనీర్ లలో బరువు తగ్గడానికి ఏది బెస్ట్ అనే విషయం తెలుసుకుంటే..

గుడ్లు(eggs) ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండే పోషకాహారం. ఒక ఉడికించిన గుడ్డులో(boiled egg) సుమారు 44గ్రాముల పోషకాలు ఉంటాయి. 5.5గ్రాముల ప్రొటీన్, 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్, జింక్, సెలీనియం, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్,కాల్షియం వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. ఈ విధంగా చూస్తే గుడ్ల ద్వారా శరీరానికి కావలసిన అన్నిరకాల విటమిన్లు, పోషకాలను సులువుగా పొందవచ్చు. చాలామంది గుడ్డు పచ్చసొనలో కొవ్వుపదార్థం ఎక్కువగా ఉంటుందని దాన్ని వదిలేస్తుంటారు. కానీ పచ్చసొనలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వ్యాయామం చేసేవారు గుడ్లను తప్పనిసరిగా తమ డైట్ లో చేర్చుకోవడం చూడచ్చు.

Bike Helmet: హెల్మెట్లను బయటే ఉంచుతున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఇలా ఎందుకు చెబుతున్నామో దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది..!


పాల నుండి లభించే పనీర్(panner) ధర విషయంలో గుడ్లతో పోలిస్తే ఎక్కువే. కానీ శాకాహారులు(vegetarians) బరువు తగ్గాలని అనుకుంటే పనీర్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. పైగా పనీర్ లో గుడ్డు కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. దీని వల్ల శరీరానికి అందే కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. పనీర్ లో 7.54గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. విటమిన్ బి12, రిబోప్లోవిన్, విటమిన్ డి, సెలీనియం వంటివి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైనది. పనీర్, గుడ్లు రెండూ బరువు తగ్గడంలో(paneer. eggs for weight loss) సహాయపడినా గుడ్ల కంటే పనీర్ లో తక్కువ కేలరీలు లభిస్తాయి. కానీ ధర పరంగా గుడ్లు చవక, పనీర్ ఖరీదు. పనీర్ ను కూడా సలాడ్ ల దగ్గర నుండి కూరల వరకు ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. పనీర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది, పైగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కాబట్టి ధర విషయంలో పర్వాలేదు అనుకునే వారు పనీర్ ను తీసుకోవడం మంచిది. తక్కువ ధరలో ప్రొటీన్ ఫుడ్ కావాలని అనిపిస్తే గుడ్లకు ఓటెయ్యచ్చు. పనీర్, గుడ్లు తీసుకుంటే ఏవైనా అలెర్జీలు ఉంటే మాత్రం వాటికి ప్రత్యామ్నాయంగా పెసలు, రాజ్మా, బ్రోకలి, బ్లాక్ బీన్స్ వంటివి తీసుకోవడం మంచిది.

Aunties vs Couple: మెట్రో రైల్లో కొత్త జంట సరసాలు.. ఇదేం పనంటూ హెచ్చరించిన మహిళలు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!


Updated Date - 2023-06-28T10:54:13+05:30 IST