Share News

Indonesia: ఉల్లాసం క్షణాల్లో విషాదంగా మారింది.. 30 అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్‌పై నడుస్తుండగా ఘోరం.. ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-29T15:10:45+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రకృతి ఒడిలో ఉంటే, మరికొన్ని కృత్రిమంగా నిర్మితమై ఉంటాయి. అన్ని రకాల పర్యాటక ప్రదేశాలనూ చూడాలని టూరిస్ట్‌లు కోరుకుంటుంటారు. అయితే అప్పుడప్పుడు ఆ పర్యాటక ప్రదేశాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.

Indonesia: ఉల్లాసం క్షణాల్లో విషాదంగా మారింది.. 30 అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్‌పై నడుస్తుండగా ఘోరం.. ఏం జరిగిందంటే..

ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాలు (Tourist Spots) ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రకృతి ఒడిలో ఉంటే, మరికొన్ని కృత్రిమంగా నిర్మితమై ఉంటాయి. అన్ని రకాల పర్యాటక ప్రదేశాలనూ చూడాలని టూరిస్ట్‌లు కోరుకుంటుంటారు. అయితే అప్పుడప్పుడు ఆ పర్యాటక ప్రదేశాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. తాజాగా ఇండోనేసియాలో (Indonesia) ఘోరం జరిగింది. ఓ గ్లాస్ బ్రిడ్జ్ (Glass Bridge) హఠాత్తుగా విరిగిపోయింది. దీంతో 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన పర్యాటకుడు మరణించాడు.

ఇండోనేసియాలో 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రసిద్ధ జియోంగ్ (Jeong Bridge) గాజు వంతెన అకస్మాత్తుగా విరిగిపోవడంతో, ఒక పర్యాటకుడు మరణించాడు. సెంట్రల్ జావాలోని సిలాసెప్‌కు చెందిన 11 మంది పర్యాటకులు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జియోంగ్ వంతెనను దాటుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది వంతెనపై నిలబడి ఉన్నారు. అయితే అద్దాలు పగిలినపుడు వాటిపై నిలబడిన ఓ పర్యాటకుడు కిందపడిపోయాడు. మరో ప్రయాణికుడు వంతెనకు వేలాడుతూ తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

ఈ ప్రమాదంతో ఇండోనేసియా పర్యాటక శాఖ వెంటనే మేల్కొంది. వంతెన భద్రతపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి మొత్తాన్ని కూలగొట్టి మళ్లీ కొత్తగా కట్టాలని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై మొత్తం విచారణ చేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2023-10-29T15:10:45+05:30 IST