Yadadri: యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..
ABN , Publish Date - Mar 06 , 2025 | 09:02 AM
సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. గురువారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

యాదాద్రి: యాదగిరిగుట్ట (Yadagirigutta ) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో (Lakshmi Narasimha Swamy temple) 6వ రోజు (6th Day) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు (Devotees) దర్శనమిస్తున్నారు (Darshan). రాత్రి సింహ వాహనంపై నరసింహుడు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన తన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో లక్ష్మీనృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు.
Read More News..:
‘ఢిల్లీ’ని మించి జగన్ అవినీతి
కాగా దివ్యాలంకారాలతో చేతిలో పిల్లన గ్రోవితో తన లీలామృత మృధుమధుర గానంతో సమ్మోహన పరూస్తూ ఏకశిఖరవాసుడు మురళీకృష్ణుడిగా భక్తజనులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం స్వామివారు శ్రీకృష్ణ అలంకరణలో ప్రత్యేక సేవలు అందుకున్నారు. జగత్తులో మంచిని రక్షించి.. చెడును చెండాడి, చేసేది ఎవరైనా, చేయించేది నేనే అంటూ లోక జనులందరికీ జ్ఞానసంపదలు ప్రసాదించిన శ్రీ కృష్ణుడి అలంకరణలో నారసింహుడిని భక్తులు దర్శించి తరించారు. పల్లకిలో మంగళవాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. ఉత్సవాలు ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాసో్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీనకుమార్‌శర్మ, జూశెట్టి క్రిష్ణ, గజ్వేల్లి రమే్‌షబాబు, రఘు, పర్యవేక్షకులు నాగుల మహే్‌షగౌడ్, ధీరావత రామరావునాయక్, రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, దాసోజు నరేష్, రాకే్‌షరెడ్డి, ముద్దసాని నరేష్, వేముల వెంకటేశ, ఉద్యోగ పాల్గొన్నారు.
పొన్న వాహనంపై చిలిపికృష్ణుడి చిద్విలాసం
భక్తపారాయణుడు జగద్రక్షకుడు శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం అవతరించిన అవతార రూపాల్లో లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య వాహన సేవలు అందుకుంటున్నారు. బుధవారం రాత్రి స్వామి వారు పొన్నవాహన సేవపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్త జనులకు దర్శనమిచ్చారు. పొన్న చెట్టు నీడలో చిలిపి కృష్ణుడు చేసిన రాసలీలా వైభవాలు భాగవతంలో పేర్కొన్న రీతిలో వాహన సేవ ఆహ్లాదకరంగా నిర్వహించారు. పొన్నవృక్షంపై వాసుదేవ స్వరూపమని సకల భక్తులకు ఆశ్రయం కలిగించే వాహన సేవలో స్వామిని భక్తులు దర్శించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు..
ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News