Inter Second Year Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే
ABN , Publish Date - Mar 06 , 2025 | 09:19 AM
Inter Second Year Exams: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఖమ్మం: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు (గురువారం) నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులను కాస్త ముందుగానే అంటే 8 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అలాగే 9.05 గంటలకు వచ్చిన విద్యార్థులను కూడా అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.. ఖమ్మం జిల్లాలో 72 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18, 877 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో బీఎన్ఎస్ఎస్ 163 యాక్ట్ అమలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ సహా ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించలేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించాయి. కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంటర్ బోర్డు నిబంధలన ప్రకారం పరీక్షలు నిర్వహించాలని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఇంటర్ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.
కీలక సూచనలు...
పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా అధికారులకు ఆదేశాలు రావడంతో వారు కూడా సిద్ధమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని ఉదయం పూట ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశాకార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. గురువారం ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి పేర్కొన్నారు. విద్యార్థులు వచ్చేటప్పుడు ఎలక్ర్టానిక్, మొబైల్స్, వంటి వస్తువులు తీసుకురావద్దని, పెన్నులు, పెన్సిల్లు, ప్యాడ్లు, స్కేల్స్, మాత్రమే తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Yadadri: యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..
Telangana: హస్తినలో తెలంగాణ శోభ
Read Latest Telangana News and Telugu News