Health Tips: రాత్రి అన్నం తినేముందు, తిన్న తర్వాత.. ఏం చేయాలి..? ఏమేం పనులు అస్సలు చేయకూడదంటే..!
ABN , First Publish Date - 2023-08-18T15:06:41+05:30 IST
ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనానికి ముందు, భోజనం తరువాత చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకోవాలి. వీటిని ఫాలో అయితే కలిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు..
రాత్రి భోజనంతో రోజువారి కార్యకలాపాలు అన్నీ ముగిసినట్టే. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మనిషి పనిసమయాల్లో భాగమవుతాయి. ఇవి రాత్రివరకు పనిచేయడానికి సరిపడా శక్తిని ఇస్తాయి. కానీ రాత్రి భోజనం చేయగానే చేసేనపనులేమీ ఉండవు. కొందరు రాత్రి భోజనం చేయగానే నిద్రపోతారు. మరికొందరు నెట్ బ్రౌజింగ్ లేదా టీవీ, సినిమాలు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనానికి ముందు, భోజనం తరువాత చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకోవాలి. వీటిని ఫాలో అయితే రాత్రి తీసుకున్న భోజనం వల్ల శరీరానికి ఏ చిన్న హాని జరగదు. పైపెచ్చు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఇంతకూ రాత్రి భోజనానికి ముందు, తరువాత చేయవసిన, చేయకూడని పనులేంటంటే..
రాత్రిభోజనానికి ముందు, తరువాత చేయవలసిన పనులు..
రాత్రి భోజనం చేసిన తరువాత తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే భోజనానికి 30నిమిషాల ముందు గోరువెచ్చని నీటిని తాగాలి(drinking warm water). ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఇది రాత్రి భోజనాన్ని అతిగా తీసుకోకుండా చేస్తుంది. ఇది అధిక బరువును నివారిస్తుంది(weight loss). బరువు పెరుగుతామనే భయం ఉన్నవారు, ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు రాత్రి భోజనానికి 30నిమిషాల ముందు గోరువెచ్చని నీరు తాగడం చాలా హెల్ప్ చేస్తుంది.
తిన్న ఆహారం ఎలాంటి సమస్యా లేకుండా జీర్ణం కావాలంటే రాత్రి భోజనం తరువాత చిన్నపాటి నడక అవసరం అవుతుంది(walking after dinner). ఇది కేవలం జీర్ణక్రియకే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రి సమయంలో కొద్దపాటి నడక పేగుల కదలికను సమర్థవంతంగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రాత్రి భోజనం తరువాత పళ్ళు తోముకోవడం(brushing after dinner) ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది భోజనం తరువాత పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు, వాటితాలూకు అవశేషాలను తొలగిస్తుంది. ఈ కారణంగా ఇది దంతక్షయం, కావిటీస్, చిగుళ్ళ వ్యాధులు దరిచేరవు. రోజురెండు పూటలా పళ్ళు తోముకునేవారు దంత సమస్యలకు దూరంగా ఉంటారు.
Hair vs Oil: జుట్టుకు నూనె రాసుకునే అలవాటు అస్సలు లేదా..? అయితే ఈ వార్తను తప్పక చదవాల్సిందే..!
రాత్రి భోజనం తరువాత చేయకూడని పనులు..
ఉదయం నుండి పనులతో అలసిపోయినవారు రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. కానీ ఇది సరైన పని కాదు. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం(sleeping after dinner) వల్ల చాలా ఆరోగ్యసమస్యలు వస్తాయి. వీటిలో మొట్టమొదటిది జీర్ణక్రియ దెబ్బతినడం. కేవలం ఇది మాత్రమే ధీర్ఘకాలం ఇలా రాత్రి తిన్నవెంటనే నిద్రపోయేవారికి కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రాత్రి తిన్న వెంటనే నిద్రపోకూడదు.
ఆరోగ్యస్పృహ బరువు గురించి ఆందోళన చెందేవారు రాత్రి భోజనం తరువాత తేలికపాటి వ్యాయామం పేరుతో అతిగా కష్టపడుతుంటారు. భోజనం తరువాత వ్యాయామం(exercise) చేయడం, బరువులు ఎత్తడం వంటివి శరీరానికి చాలా చెడు చేస్తాయి. రాత్రి సమయాల్లో వ్యాయామం చేస్తే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత నిద్ర చక్రాన్ని నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలను నియంత్రిస్తుంది. దీనివల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు.