ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage Gift Kills Groom: పెళ్లికి వచ్చిన బహుమతే.. ఆ వరుడి ప్రాణాలను తీసేసింది.. పెళ్లయిన రెండ్రోజుల తర్వాత గిఫ్టులను బయటకు తీసి..

ABN, First Publish Date - 2023-04-04T16:06:00+05:30

ఓ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేసి ఉపయోగించగానే పెళ్లికొడుకు ప్రాణాలు (newly married man) పోయాయి. ఎందుకు? ఏమైంది? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Marriage Gift
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెళ్లి (wedding) అనగానే అతిథులందరూ గిఫ్ట్‌లు (gift) తీసుకురావడం సహజం. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన బహుమతిని తీసుకొస్తుంటారు. అన్నీ అదే రోజు ఓపెన్ చేయడానికి కుదరకపోవచ్చు. వివాహం అయ్యాక హనీమూన్‌కి వెళ్లడం.. ఇరువైపులా అత్తామామల ఇళ్లకు తిరగడం జరుగుతుంటాయి. పెళ్లైన కొత్తలో ఇవన్నీ సహజమే. అలా రెండ్రోజులు గడిచింది. తీరిక దొరకడంతో కొత్త పెళ్లికొడుకుకి స్నేహితులు, బంధువులు తెచ్చిన బహుమతులు గుర్తుకొచ్చాయి. ఎవరెవరు ఏ ఏ బహుమతులు తెచ్చారో చూసేందుకు వరుడి ప్రయత్నించాడు. అలా ఒక్కొక్కటి తెరుస్తుండగా ఓ పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేసి ఉపయోగించగానే పెళ్లికొడుకు ప్రాణాలు (newly married man) పోయాయి. ఎందుకు? ఏమైంది? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కవార్ధా జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్రకు రెండ్రోజుల క్రితమే మ్యారేజ్ (marriage) జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు రకరకాలైన బహుమతులు తీసుకొచ్చారు. ఆదివారం (ఏప్రిల్ 2) పెళ్లికి వచ్చిన గిఫ్ట్‌లను ఒక్కొక్కొటీ నవ వరుడు ఓపెన్ చేస్తున్నాడు. ఓ హోం థియేటర్ (Home theatre sytem) కూడా బహుమతిగా వచ్చింది. గిఫ్ట్ కవర్ చింపి హోం థియేటర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. వెంటనే బాంబు పేలినట్టుగా పెద్ద శబ్దంతో (explodes) అది పేలిపోయింది. దీంతో నవ వరుడు హేమేంద్ర, పెళ్లి కొడుకు సోదరుడు రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించారు. శుభకార్యం జరిగిన ఇంట్లో విషాదం జరగడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హోం థియేటర్ ప్రమాదవశాత్తు పేలిందా? లేదంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-04T16:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising