Jamuna: హరనాథ్ అంటే ఇష్టంగా ఉండేవారు
ABN , First Publish Date - 2023-01-27T11:18:32+05:30 IST
అప్పట్లో జమున కి పెద్దగా అభిమానులు ఉండేవారు. అయితే జమున కూడా చిత్ర పరిశ్రమలో నటుల్లో ఒకరంటే ఇష్టపడేవారు అని అప్పట్లోనే అనుకునేవారు. అతను మరెవరో కాదు నటుడు హరనాథ్.
మహానటి సావిత్రి, (Savitri) సరోజాదేవి (B Sarojadevi), ఎస్ వరలక్ష్మి (S Varalakshmi) తరువాత అప్పట్లో జమున (Jamuna)ఒక పెద్ద సూపర్ స్టార్. అప్పట్లో ఎన్.టి.ఆర్(NTR), ఏ.ఎన్.ఆర్ (ANR) లాంటి నటులతో పోటీ పడి నటించటమే కాకుండా, వాళ్ళతో పాటుగా సరి సమానమైన పేరు తెచ్చుకోవటం అంటే నటీమణులకు గొప్పే. అంతటి గొప్ప నటులతో కూడా నటిస్తూ, జమున తనదయిన నటనతో చిత్రసీమలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో జమున కి పెద్దగా అభిమానులు ఉండేవారు. అయితే జమున కూడా చిత్ర పరిశ్రమలో నటుల్లో ఒకరంటే ఇష్టపడేవారు అని అప్పట్లోనే అనుకునేవారు. అతను మరెవరో కాదు నటుడు హరనాథ్ (Haranath).
వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు కూడా. జమున కి హరనాథ్ అంటే అమితమయిన ఇష్టం అది ప్రేమగా కూడా మారింది అని అంటారు. అప్పట్లోనే చిత్ర పరిశ్రమలో వీరిద్దరూ ఒక సంచలనం లా ఉండేది అనేవారు. వివాహానికి కూడా ఇద్దరూ సిద్దమయి చేసుకుందామని అనుకున్నారట కూడా. కానీ జమున కి అప్పట్లో ఇంకో సీనియర్ నటుడు ఎస్.వి. రంగారావు (SV Ranga Rao) గారు బాగా చనువుగా ఉండేవారట. రంగారావు గారు ఒకరోజు జమున గారిని పిలిచి, హరనాథ్ ని చేసుకోవద్దు అని సలహా ఇచ్ఛారుట. హరనాథ్ అప్పట్లో చాలా అందంగా ఉండేవారు. వున్న నటుల్లో అందంగా వున్నవాళ్లలో హరనాథ్ ఒకరు, పెద్ద హీరో అవుతాడు అని అందరూ అనుకునేవారు అప్పట్లో. అలా జమునగారి జీవితం లో హరనాథ్ గారు తళుక్కున మెరిసి మళ్ళీ మాయం అయిపోయారు.