Share News

Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-12-05T12:44:52+05:30 IST

Kids fighting Video: ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారితో ఆడుకుంటుంటే అసలు సమయమే తెలియదు. రోజంతా చాలా సరదాగా గడిచిపోతుంది. అయితే, కవలలు ఉన్న ఇంట్లో మాత్రం పేరెంట్స్‌కు కూసింత తలనొప్పి తప్పకపోవచ్చు. ఎందుకంటే వారు కలిసిమెలిసి ఉంటే పర్లేదు.

Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

Kids fighting Video: ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. వారితో ఆడుకుంటుంటే అసలు సమయమే తెలియదు. రోజంతా చాలా సరదాగా గడిచిపోతుంది. అయితే, కవలలు ఉన్న ఇంట్లో మాత్రం పేరెంట్స్‌కు కూసింత తలనొప్పి తప్పకపోవచ్చు. ఎందుకంటే వారు కలిసిమెలిసి ఉంటే పర్లేదు. కానీ, ఎప్పుడూ గొడవపడుతుంటే మాత్రం తల్లిదండ్రులకు ఆ కవలలను సర్ది చెప్పడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఈ వీడియోలో కవలలు ఇలాగే చిటికీమాటికీ గొడవ పడుతుండడం మనం చూడొచ్చు. అయితే, అలా గొడవ పడుతున్న ఆ పిల్లలను వారి తల్లి ఎలా ఆపిందో చూస్తే మాత్రం కడుపుబ్బా నవ్వడం ఖాయం!

Aeroplane: విమానంలో షాకింగ్ ఘటన.. సీటు దగ్గర రక్తపు మరకలు.. సిబ్బందికి చెబితే మీరే తుడుచుకోండంటూ..!


వీడియోలో ఇద్దరు చిన్నారులను మనం చూడొచ్చు. వారిద్దరూ కవలలు. అయితే, ఒక పాప మరో పాప జట్టును ఎప్పుడూ లాగడం చేస్తుండడంతో పాపం ఆ చిన్నారి ఏడుపు అందుకుంటుంది. అలా వారిద్దరూ గొడవ పడుతున్న ప్రతిసారి తల్లి వారిని విడిపించడం చేసింది. కానీ, ఎంతకు వారి మధ్య ఆ జట్టు పీక్కోవడం ఆగలేదు. దాంతో ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేసింది. అంతే.. ఆ తర్వాతి నుంచి వారి మధ్య గొడవ ఆగిపోయింది. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి వారిద్దరి మధ్య గొడవను ఆపేసింది. ఇంతకీ.. ఆ తల్లి ఏం చేసిందంటే.. ఆ ఇద్దరికి తల వెంట్రుకలు తీయించేసింది. దాంతో వారు ఒకరి జట్టు ఒకరు లాగడం ఆగిపోయింది. జట్టు చిన్నగా అయిపోవడంతో వారి చేతికి అందకుండా పోయింది.

Viral Video: బస్సులో వెనుక సీట్లో కూర్చుని సీక్రెట్‌గా తీసిన వీడియో.. ఈ వ్యక్తి చేసేది చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

ఈ వీడియోను 'ద ట్విన్స్- నాయనిష్కా' అనే ఇన్‌స్టా యూజర్ షేర్ చేశారు. వీడియో పాతదే అయినా వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం. ఈ వీడియోను ఇప్పటివరకు 5మిలియన్లకు పైగా మంది వీక్షించారు. 48లక్షల వరకు లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు అంతే కామెడీగా స్పందిస్తున్నారు. "చిన్న చిట్కాతో తల్లి కవలల గొడవ భలే ఆపేసింది","పాపం.. వారిని జుట్టు లేకుండా చూడలేకపోతున్నా","ఈ వీడియో చూసిన ప్రతిసారి నవ్వు ఆగడం లేదు. చివరగా ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందంతే" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం కవలల గొడవ.. దానికి వారి తల్లి కనిపెట్టిన చిన్న పరిష్కారాన్ని చూసి మీరూ కడుపుబ్బా నవ్వుకోండి మరి.

Bank Robbery: సడన్‌గా బ్యాంకులోకి దూరిన ముసుగు ముఠా.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి రూ.18 కోట్లు కొట్టేశారు..

Updated Date - 2023-12-05T12:48:03+05:30 IST