Perambalur: బైక్‌పై పార్వతీపరమేశ్వరుల విహారం

ABN , First Publish Date - 2023-07-19T07:49:55+05:30 IST

పెరంబలూరు(Perambalur) జిల్లా సెంగుణంలోని మహా మారియమ్మన్‌ ఆలయ వేడుకల్లో పార్వతీ పరమేశ్వర్లను బైకుపై ఊరేగించడం చర్చనీయాం

Perambalur: బైక్‌పై పార్వతీపరమేశ్వరుల విహారం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): పెరంబలూరు(Perambalur) జిల్లా సెంగుణంలోని మహా మారియమ్మన్‌ ఆలయ వేడుకల్లో పార్వతీ పరమేశ్వర్లను బైకుపై ఊరేగించడం చర్చనీయాంశం అ య్యింది. ఆ ఆలయ వార్షిక రథోత్సవాలు ఈనెల 12న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. మహా మండలాభిషేకం(Maha Mandalabhishekam) సందర్భంగా మారియమ్మన్‌ సహా 10 దేవతా మూర్తుల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాణసంచా వేడుకలతో ఈ వాహన సేవలు ప్రారంభయ్యాయి. 10 ట్రాక్టర్లలో దేవతా మూర్తులను వాహనాల్లో ఆశీనులు కావించి ఊరేగించారు. వినాయకుడిని మూషికవాహనంపై, కుమారస్వామిని నెమలిపై, మహావిష్ణువును గరుడవాహనంపై, గోదాదేవిని హంసవాహనంపై, కాళికాదేవిని సింహవాహనంపై ఆశీనులు కావించారు. అయితే ఆది దంపతులుగా పేరుగాంచిన శివపార్వతులను అందంగా అలంకరించి బైకుపై ఆశీనులు కావించారు. పరమేశ్వరుడు బైకు హ్యాండిల్‌ పట్టుకుని నడుపుతుండగా, పార్వతీదేవి వెనుక సీటుపై కూర్చున్నట్టు అలంకరించి ఓ ట్రాక్టర్‌పై గ్రామంలో ఊరేగించారు. పార్వతీ పరమేశ్వర్లను నందివాహనం ఊరేగించడానిక బదులుగా బైకుపై ఊరేగించడం చూసి భక్తులు విస్మయం చెందారు.

Updated Date - 2023-07-19T07:49:55+05:30 IST