Singer Weight Loss: ఈ ఒక్క డ్రింక్‌ను మానేశాడట.. దెబ్బకు 25 కేజీల బరువు తగ్గిన ప్రముఖ సింగర్..!
ABN , First Publish Date - 2023-08-23T16:56:56+05:30 IST
కేవలం తినడం, తాగడం తగ్గించగానే బరువు తగ్గడం సాధ్యం కాకపోవచ్చు. ఇందుకోసం బోలెడు శారీరక శ్రమ కూడా చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రముఖ సింగర్ కేవలం ఒకే ఒక పానీయాన్ని తీసుకోవడం మానెయ్యగానే దెబ్బకు 25కేజీల బరువు ఈజీగా తగ్గాడు.
బరువు అనేది వివిధ రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. జన్యువుల నుండి ఆహారం, జీవనశైలి, అలవాట్లు మొదలైనవి బరువు మీద ప్రభావం చూపిస్తాయి. అయితే బరువు పెరగడానికి చాలా ఎక్కువ కారణమయ్యేది ఆహారం, పానీయాలు. అందుకే బరువు తగ్గాలని అనుకునేవారు, బరువు పెరగకూడదని అనుకునేవారు తిండి దగ్గర, తాగడం దగ్గర గీత గీసుకుంటారు. అయినప్పటికీ కేవలం తినడం, తాగడం తగ్గించగానే బరువు తగ్గడం సాధ్యం కాకపోవచ్చు. ఇందుకోసం బోలెడు శారీరక శ్రమ కూడా చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రముఖ సింగర్ కేవలం ఒకే ఒక పానీయాన్ని తీసుకోవడం మానెయ్యగానే దెబ్బకు 25కేజీల బరువు ఈజీగా తగ్గాడు. తినే, తాగే పదార్థాలు ఎంత ప్రభావం చూపిస్తాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణగా కనిపిస్తోంది. ఇంతకూ ఈ సింగర్ ఎవరు? అతను బరువు తగ్గడానికి మానేసిన డ్రింక్ ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
అమెరికన్ రాపర్(American rapper) పోస్ట్ మలోన్(Post Malone) ఐ ఫాల్ అపార్ట్(I fall Apart), సన్ప్లవర్(sunflower), గో ఫ్లెక్స్(go flex), కంగ్రాట్చ్యులేషన్(congratulations) వంటి పాటలతో మంచి సిగంర్(rapper singer) గా పేరు తెచ్చుకున్నాడు. ఇతను ఈమధ్య ఏకంగా 25కేజీల బరువు తగ్గడం చర్చనీయాంశంగా మారింది. అంతకుమునుపు 109కిలోల బరువు ఉండేవాడు.కానీ అతను తన డైట్ లో భాగంగా తీసుకునే ఒకే ఒక్క డ్రింక్ తాగడం మానేశాడు. అదే కోక్(avoid coke). ప్రదర్శనకు ముందు ఉత్సాహం కోసం అతను కోక్ ను ఐస్ తో తీసుకునేవాడట. అది జీరో కేలరీల కోక్ కావడంతో అతను దాని గురించి మొదట పెద్దగా ఆలోచించలేదు. కానీ అతను తండ్రి కావడం అతని జీవితంలో ఈ మార్పుకు మూలమైంది. అతని భార్య ఓ బిడ్డను ప్రసవించిన తరువాత అతనికి తన ఆరోగ్యం మీదనే కాకుండా తన బిడ్డను బాగా చూసుకోవాలంటే తను బాగుండాలనే ఆలోచన కూడా మనసులో మెదిలింది. ఇందుకోసమే అతను రోజూ తాగే కోక్ కు గుడ్ బై చెప్పాడు. ఫలితంగా కొన్ని నెలల్లోనే అతను 25కేజీల బరువు తగ్గినట్టు తెలిపాడు.
Health Tips: చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? వేసుకుని నడిస్తే మంచిదా..? దేని వల్ల ఎక్కువ లాభమంటే..!
చాలామంది జీరో కేలరీలు ఉన్న కోక్ తీసుకోవడం వల్ల ఏమీ కాదులే అనే భావనలో ఉంటారు. పోస్ట్ మెలోన్ కూడా మొదట ఇలాగే ఆలోచించాడు. కానీ కోక్ జీరో కేలరీలది అయినా దాన్ని తీసుకోవడం వల్ల అది శరీరంలో ఆహార వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది ఫాస్ట్ ఫుడ్ , రుచికరమైన ఆహారం వైపు దృష్టి కలిగేలా ప్రేరేపిస్తుంది, అలాగే అధిక ఆకలికి కూడా కారణం అవుతుంది. కృత్రిమ రసాయనాలు కలిగిన డ్రింక్స్ తాగేవారు సహజంగానే బరువు పెరుగుతారని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. ప్రతిరోజూ 12ఔన్సుల(354.882మి.లీ) కోక్ తీసుకోవడం పోస్ట్ మెలోన్ కు అలవాటు ఉండేది. ఇది ఆపడం వల్ల సుమారు 280కేలరీలు తీసుకోవడం ఆగిపోయిది. అంటే నెలకు 8400కేలరీలు అవాయిడ్ చేసినట్టు. ఇలా అతను 109 కిలోల నుండి ఏకంగా 25కేజీల బరువు తగ్గి 84కిలోలకు చేరాడు. ఇతను కోక్ ఆపడానికి గల కారణాన్ని తెలుసుకున్నవారు బిడ్డ కోసం తండ్రి ఏదైనా చేయగలుగుతాడు అదే తండ్రి ప్రేమ అంటున్నారు.