కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

ABN, First Publish Date - 2023-10-01T18:10:49+05:30

క్లాసు రూంలోకి టీచర్ వచ్చారంటే పిన్‌డ్రాప్ సైలెంట్ అయ్యే రోజులు పోయి.. విద్యార్థులను చూసి టీచర్లే భయపడే రోజులు వచ్చాయి. కొందరు విద్యార్థులు తరగతి గదుల్లోనే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయుల పైనే దాడికి దిగడం కూడా చూస్తుంటాం. తాజాగా..

Viral Video: అమెరికా స్కూళ్లలో ఇలా కూడా జరుగుతుందా.. క్లాసు రూంలో ఏమాత్రం భయం లేకుండా.. ఈ అమ్మాయి చేసిన పని చూడండి..

క్లాసు రూంలోకి టీచర్ వచ్చారంటే పిన్‌డ్రాప్ సైలెంట్ అయ్యే రోజులు పోయి.. విద్యార్థులను చూసి టీచర్లే భయపడే రోజులు వచ్చాయి. కొందరు విద్యార్థులు తరగతి గదుల్లోనే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయుల పైనే దాడికి దిగడం కూడా చూస్తుంటాం. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. క్లాసు రూంలో అందరి ముందూ ఏమాత్రం భయం లేకుండా.. ఓ విద్యార్థిని ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలోని (America) మిచిగాన్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫ్లింట్ సౌత్‌వెస్ట్రన్ అకాడమీ హైస్కూల్లో గురువారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారణం ఏంటో తెలీదు గానీ విద్యార్థుల మధ్య ఉన్నట్టుండి (Quarrel between students) గొడవ మొదలైంది. ఇది కాస్త కాసేపటికి ఇంకా పెద్ద గొడవగా మారింది. దీంతో ఓ మహిళా టీచర్ తరగతి గదిలోకి వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. విద్యార్థినుల వద్దకు వెళ్లి వారిని పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. ఇంతలో వారిలో ఓ యువతికి టీచర్‌పై పట్టరాని కోపం వచ్చింది. కాసేపు కోపంగా చూసి తర్వాత పక్కనే ఉన్న కుర్చీని తీసుకుని (Student attack on teacher) టీచర్‌ పైకి గట్టిగా విసిరింది. టీచర్ తలకు కుర్చీ గట్టిగా తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

Viral Video: వామ్మో! బుల్ ఫైట్ చూసేందుకు వెళ్లిన యువతిపై ఎద్దు దాడి.. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వదలకుండా..

ఈ ఘటనతో అక్కడున్న మిగతా విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరైతే కనీసం టీచర్ దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడి దూరంగా నిలబడిపోయారు. కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. మరికొందరైతే.. ‘‘మనకెందుకొచ్చిన గొడవ’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఇంకొందరు ఏమీ పట్టనట్లు అలాగే కూర్చుండిపోయారు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘క్రమశిక్షణ లేకుంటే ఇలాగే జరుగుతుంది’’.. అని కొందరు, ‘‘అయ్యో పాపం! ఎంత దారుణం’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! అమెరికాలో ఇలాక్కూడా జరుగుతుందా’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

Updated Date - 2023-10-01T18:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising