Viral Photo: మీ కంటి చూపునకు ఓ పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న సంఖ్య ఎంతో చెప్పగలరా..?
ABN , First Publish Date - 2023-02-16T15:19:57+05:30 IST
సూటిగా సుత్తిలేకుండా కంటిచూపు ఎంత పదునుందో తేల్చుకోమంటున్నారు.
'చెప్పుకోండి చూద్దాం..' అని పొడుపు కథలు వేస్తుంటారు చాలా మంది. అయితే ఇక్కడ ఎలాంటి పొడుపుకథ లేదు. సూటిగా సుత్తిలేకుండా కనిపించింది చెప్పమంటున్నారు. కంటిచూపు ఎంత పదునుందో తేల్చుకోమంటున్నారు. నెట్టింట్లో అందరినీ ముప్పు తిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్ళు తాపిస్తోంది ఓ వైరల్ ఫోటో. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సోషల్ మీడియాలో చాలా చోట్ల కొన్ని ఫోటోస్ బ్లర్ చేసి, మరికొన్ని కలర్స్ తో కవర్ చేసి అందులో కొన్ని నెంబర్స్ జొప్పించి వాటిని చెప్పండి చూద్దాం అని సవాల్ చేస్తుంటారు. కొన్ని చాలా ఈజీగానే ఉంటాయి. మరికొన్ని మాత్రం మెదడును అయోమయానకి గురిచేస్తాయి. ఇప్పుడు చెప్పుకుంటున్నది కూడా అలాంటిదే.. @SJosephBurns అనే ట్విట్టర్ యూజర్ ఒక ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇందులో ఉన్న నెంబర్ ఎంతో చెప్పండి చూద్దాం అని ఛాలెంజ్ చేశారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫొటోలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కొన్ని నంబర్స్ అందులో భాగం చేశారు. తదేకంగా ఫొటోను 10సెకెన్ల పాటు చూస్తే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. కంటిచూపు ఎంతో పదును ఉంటే తప్ప ఆ నెంబర్స్ చెప్పడం సాధ్యం కాదు. మీకూ మీ కంటిచూపు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో తెలుసుకోవాలని ఉంటే ఫోటోలో నెంబర్స్ చెప్పండి,అలాగే మీ పక్కనే ఉన్న వాళ్లతోనూ సరదాగా చెప్పించండి. ఎవరు కరెక్ట్ గా చెబుతారో చూద్దాం.