Ugly Brawl: అయ్య బాబోయ్.. సింగిల్ సిల్క్ శారీ కోసం ఇద్దరు మహిళలు ఎలా కొట్టుకున్నారో చూడండి..!
ABN , First Publish Date - 2023-04-28T11:18:39+05:30 IST
సింగిల్ సిల్క్ శారీ (Silk Saree) కోసం ఇద్దరు మహిళలు బాహాబాహీకి దిగిన ఘటన, దాని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సింగిల్ సిల్క్ శారీ (Silk Saree) కోసం ఇద్దరు మహిళలు బాహాబాహీకి దిగిన ఘటన, దాని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొట్టుకోవడమంటే అలా ఇలా కాదండోయ్.. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. పక్కన ఉన్నవాళ్లు విడిపించే ప్రయత్నం చేసిన వారి వల్ల కాలేదు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కర్నాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మల్లేశ్వరం సిల్క్ శారీ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక సెల్ సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
ఒక మైసూర్ సిల్క్ శారీ (Mysore Silk Saree) కొనుగోలు చేసే విషయంలో ఇద్దరు మహిళల మధ్య మాటలతో మొదలైన చిన్న గొడవ కాస్త చివరకు కొట్టుకునే వెళ్లింది. కొట్టుకోవడమంటే మాములుగా కాదు. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. అలా వారిద్దరూ కొట్టుకోవడం చూసిన షాపులోని ఇతర మహిళలు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. కానీ, వారి వల్ల కాలేదు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వారిని విడిపించారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. రవి(@ravidya2000) అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.51లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.