ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: పులి vs సింహం తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? అయితే ఫైనల్లో చూద్దాం రండి..

ABN, First Publish Date - 2023-09-16T16:36:02+05:30

ఒక వైపు పులి, మరొక వైపు సింహం ఈ రెండు మైదానంలో తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఊహించుకోవడానికే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఆ రెండు జంతువుల బలం అలాంటిది.

కొలంబో: ఒక వైపు పులి, మరొక వైపు సింహం ఈ రెండు మైదానంలో తలపడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఊహించుకోవడానికే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది కదూ! ఆ రెండు జంతువుల బలం అలాంటిది. ఒకదానికొకకటి ఏ మాత్రం తగ్గవు. పంజా విసరడంలో అయిన, బలబలాల విషయంలో అయిన, పోరాటంలో అయిన, రెండింట్లో ఏది బలమైనది అంటే చెప్పడం కష్టం. ఇక అలాంటి జంతువుల మధ్య ఫైట్ అంటే ఇంకేమైనా ఉందా? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఆదివారం జరిగే ఆసియా కప్ 2023లో ఫైనల్‌లో అచ్చం అలాంటి ఫైటే జరగబోతుంది. ఆసియా కప్ చరిత్రలోనే అత్యంత బలమైన జట్లగా పేరు గాంచిన భారత్, శ్రీలంక రేపు అమితుమి తేల్చుకోనున్నాయి. కొన్ని రోజులుగా అనేక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికులను ఉర్రుతూలుగించిన ఆసియా కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యంత బలమైన జట్లుగా పేరు గాంచిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ చేరాయి. కొలంబో వేదికగా జరిగే ఈ ఫైనల్‌లో ఏ జట్టు ట్రోఫి గెలిచినా చివరి వరకు ఉత్కంఠ తప్పకపోవచ్చు. ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్ల గత రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. పైగా 13 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఆసియా కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్‌లో రెండు జట్ల గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే వీటి పోరు ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతుంది.


ఆసియా కప్ చరిత్రలో భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 22 సార్లు తలపడ్డాయి. అయితే రెండు జట్లు ఏ మాత్రం తగ్గలేదు. నువ్వా నేనా అన్నట్టుగా రెండు జట్లు చెరో 11 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ ఒక్క రికార్డు చాలా ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి. ఇక ఆసియా కప్ ఫైనల్‌లో రెండు జట్లు 6 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా అత్యధికంగా 4 సార్లు గెలవగా.. శ్రీలంక రెండు సార్లు గెలిచింది. వన్డేల్లో శ్రీలంక గడ్డ మీద రెండు జట్లు ఇప్పటివరకు 65 సార్లు తలపడ్డాయి. అయితే ఈ పోటీలో టీమిండియాదే స్వల్పంగా పైచేయి అయింది. టీమిండియా 31 మ్యాచ్‌ల్లో గెలవగా.. శ్రీలంక 28 మ్యాచ్‌ల్లో గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. దీనిని బట్టి ఫైనల్ మ్యాచ్ జరిగేది శ్రీలంక గడ్డ మీద అయినప్పటికీ టీమిండియా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా టీమిండియా 7 సార్లు టైటిళ్లు గెలిచింది. 6 టైటిళ్లతో శ్రీలంక కూడా మన వెనకాలేత ఉంది. దీంతో ఈ సారి ఎలాగైన టైటిల్ గెలిచి లెక్క సరి చేయాలని లంకేయులు పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు పాకిస్థాన్ రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ గెలిచింది. దీనిని బట్టే చెప్పేయొచ్చు. ఆసియా కప్‌లో సరైన పోటీ దారులంటే భారత్ vs పాకిస్థాన్ కాదు.. భారత్ vs శ్రీలంక అని.

అయితే అత్యధిక సార్లు ఫైనల్ చేరిన రికార్డు మీద మాత్రం శ్రీలంక పేరు మీదనే ఉంది. శ్రీలంక 12 సార్లు ఫైనల్ చేరగా.. భారత్ 11 సార్లు ఫైనల్ చేరింది. ఇక మొత్తంగా చూసుకుంటే వన్డే ఫార్మాట్లో రెండు జట్లు ఇప్పటివరకు 166 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా అత్యధికంగా 97 మ్యాచ్‌ల్లో గెలవగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా.. 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. దీనిని బట్టి ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌ హోరాహోరీగా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫైనల్ మ్యాచ్ జరిగే కొలంబోలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు చివరి వరకు తీవ్ర ఉత్కంఠకు గురి చేశాయి. ఇక ఈ రికార్డులను చూస్తే ఫైనల్‌లో పులి వర్సెస్ సింహం ఫైట్ చూడొచ్చనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. రెండు జట్ల బలబలాలను ఇలా పోల్చడానికి ఒక కారణం కూడా ఉంది. అదేటంటే భారతదేశం జాతీయ జంతువు పులి కాగా.. శ్రీలంక జాతీయ జెండాలో సింహం బొమ్మ ఉంటుంది. దీంతో పలువురు ఆసియా కప్ ఫైనల్‌లో పులి వర్సెస్ లయన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ థ్రిల్ ఇచ్చే అవకాశాలున్నాయి.

తుది జట్లు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ

Updated Date - 2023-09-16T16:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising