ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BCCI: వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు కుదరవు.. హెచ్‌సీఏకు స్పష్టం చేసిన బీసీసీఐ

ABN, First Publish Date - 2023-08-22T14:20:51+05:30

అక్టోబర్‌ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్‌, అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్‌, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. దీంతో వరుస రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సెక్యూరిటీ కల్పించేందుకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సీఏ దృష్టి తీసుకెళ్లారు. కానీ టోర్నీ షెడ్యూల్ మార్చాలంటే ఇతర క్రికెట్ క్లబ్‌లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. దీంతో ఉప్పల్‌లో షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ మార్చాలని బీసీసీఐకి లేఖ రాసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చే ప్రసక్తే లేదని హెచ్‌సీఏకు బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు సెక్యూరిటీ ఇబ్బంది తలెత్తుతుందని.. షెడ్యూల్ మార్చాలని ఇటీవల బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాసింది. అక్టోబర్‌ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్‌, అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్‌, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. దీంతో వరుస రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సెక్యూరిటీ కల్పించేందుకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సీఏ దృష్టి తీసుకెళ్లారు. కానీ టోర్నీ షెడ్యూల్ మార్చాలంటే ఇతర క్రికెట్ క్లబ్‌లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు. దీంతో ఉప్పల్‌లో షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Team India: ఆసియా కప్ జట్టులో 8 మంది ముంబై టీమ్ ఆటగాళ్లు..!!

కాగా హైదరాబాద్‌‌లోని ఉప్పల్ వేదికగా జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ మార్పుపై తమకు ఓ లేఖ అందినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. అయితే షెడ్యూల్ మార్చడం అంత ఈజీ కాదన్నారు. షెడ్యూల్ మార్పు అనేది కేవలం బీసీసీఐ చేతుల్లోనే ఉండదని.. ప్రపంచకప్‌లో ఆడే జట్లు, ఐసీసీ, క్రికెట్ సంఘాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దీంతో షెడ్యూల్‌లో మార్పు అసాధ్యమని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావడంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్ ఉండబోదని.. అంతేకాకుండా సెక్యూరిటీ సమస్య తలెత్తుతుందని హెచ్‌సీఏ వాదిస్తోంది. ఇటీవల అహ్మదాబాద్‌, కోల్‌కతాలో జరగనున్న కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చడంతో తమ విజ్ఞప్తిని కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని హెచ్‌సీఏ భావించింది. తాజాగా ప్రపంచకప్ షెడ్యూల్ మార్చబోమని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో హెచ్‌సీఏ అధికారులు భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే నగర పోలీసులు కమిషనర్‌తో మాట్లాడారు. భద్రత విషయంలో కమిషనర్ హామీ ఇచ్చినట్లు హెచ్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-08-22T14:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising