ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashish Nehra: హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే.. కానీ గుజరాత్ కెప్టెన్‌గా ఆ కుర్రాడే సరైనోడు..

ABN, Publish Date - Dec 21 , 2023 | 02:11 PM

Gujarat Titans: హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించే బాధ్యత యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌పై ఉందని అన్నాడు.

హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించే బాధ్యత యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌పై ఉందని అన్నాడు. గుజరాత్ కెప్టెన్‌గా 24 ఏళ్ల కుర్రాడు శుభ్‌మాన్ గిల్ సరైనోడని నెహ్రా చెప్పాడు.‘‘ప్రతిభ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. గత మూడు, నాలుగేళ్లలో ఎలా ఎదిగాడో మనం చూశాం. అతని వయసు 24 సంవత్సరాలు మాత్రమే. కానీ అతనిపై పెద్ద బాధ్యతే ఉంది. మేము గిల్‌ను నమ్ముతున్నాం. అందుకే అతడిని కెప్టెన్‌ను చేశాం. నేను ఎప్పుడూ ఫలితాలతోనే ముందుకు వెళ్లే వ్యక్తిని కాదు. ఫలితాలు ముఖ్యమే కానీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు గిల్ సరైన వ్యక్తి అని మాకు నమ్మకం ఉంది.’’ అని ఆశిష్ నెహ్రా చెప్పాడు.


అలాగే ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌కు భారీ ధర పలకడంపై నెహ్రా స్పందించాడు. ఐపీఎల్‌లో అధిక ధర అన్న దానికి కొలమానం లేదని, స్టార్క్ ఎలాంటి బౌలరో అందరికీ తెలుసని చెప్పాడు. తమకు సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్ అవసరం ఉందని చెప్పిన నెహ్రా.. జట్టు వ్యూహాల్లో భాగంగానే అతడిని కొనేందుకు ప్రయత్నించామని చెప్పాడు. అయితే ప్రస్తుతం తమ దగ్గర ఉన్న పేస్ దళంతో సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా స్టార్క్‌కు అంత మొత్తం చెల్లించడం తనను ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో రూ.24.75 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు ధరకు స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే వ్యవహరించబోతున్నాడు.

Updated Date - Dec 21 , 2023 | 02:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising