ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs ENG: అరుదైన రికార్డుకు 47 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ABN, First Publish Date - 2023-10-29T10:44:43+05:30

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 17,953 పరుగులు చేశాడు.

లక్నో: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 17,953 పరుగులు చేశాడు. దీంతో మరో 47 పరుగులు చేస్తే 18 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. రోహిత్ శర్మ కంటే ముందు ఈ రికార్డును సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ అందుకున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లోనే ఈ రికార్డును అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. తన అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 456 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 476 ఇన్నింగ్స్‌ల్లో 43 సగటుతో 17,953 పరుగులు చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగు సార్లు డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264గా ఉంది. 62 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.


ఇక ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని భారత్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒకే ఒక విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన 10వ స్థానంలో ఉంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు కూడా దాదాపుగా ముగిశాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని ఇంగ్లీష్ టీం భావిస్తోంది. ఇక రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది 100వ మ్యాచ్ కావడం గమనార్హం. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు 62 సగటుతో 311 పరుగులు చేశాడు.

Updated Date - 2023-10-29T10:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising