ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs NZ: 4 ఏళ్ల క్రితం నాటి ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం ఇదే!

ABN, First Publish Date - 2023-11-15T08:49:45+05:30

అవును నాలుగేళ్ల క్రితం మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. న్యూజిలాండ్‌ను దెబ్బకు దెబ్బకు తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందటి పీడ కలను చెరిపివేసి దాని స్థానంలో మరుపురాని విజయాన్ని పదిలంగా దాచుకోవడానికి సరైన సమయం ఇదే. 2019 జూలై 9. ఇప్పటికీ మన జట్టును పీడకలలా వెంటాడుతున్న తేదీ ఇది.

ముంబై: అవును నాలుగేళ్ల క్రితం మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. న్యూజిలాండ్‌ను దెబ్బకు దెబ్బకు తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందటి పీడ కలను చెరిపివేసి దాని స్థానంలో మరుపురాని విజయాన్ని పదిలంగా దాచుకోవడానికి సరైన సమయం ఇదే. 2019 జూలై 9. ఇప్పటికీ మన జట్టును పీడకలలా వెంటాడుతున్న తేదీ ఇది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. లక్ష్యం మోస్తరుదే అయినప్పటికీ మన వాళ్లు చేధించలేకపోయారు. ఆ రోజు చివరలో ధోని రనౌట్ ఇప్పటికీ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంది. నాటి మ్యాచ్‌లో ధోని రనౌట్ అయ్యాక చోటుచేసుకున్న సంఘటనలు ఇప్పటికీ తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తుంటాయి. ధోని రనౌట్ అవడం, జట్టు ఓడిపోవడంతో ఆ టోర్నీలో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే టీవీల్లో చూస్తున్న మన గుండెలు బరువెక్కిపోయాయి. మోహానికి చేతిని అడ్డుపెట్టుకుని ఆ రోజు హిట్‌మ్యాన్ బోరున విలపిస్తూంటే మన కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఈ కన్నీటి చుక్కలు ఆ రోజు ఒక్క రోహిత్‌కే పరిమితం కాలేదు. ఇతర జట్టు సభ్యులు, టీమిండియా అభిమానులకు విస్తరించాయి. ఓటమి బాధతో మనసులో కుమిలిపోయాం.


కానీ ఇదంతా ఇక గతం. కివీస్‌ను దెబ్బకు దెబ్బ తీసే సమయం టీమిండియా వచ్చేసింది. యాదృచ్చికమో లేదంటే 4 ఏళ్ల క్రితం మన కన్నీటి చుక్కలను చూసి ఆ దేవుడే ఇలా చేశాడో తెలియదు కానీ , 2019లో భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు ఎలాంటి పరిస్థితులు దారి తీశాయో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2019 ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తలపడ్డాయి. రెండు జట్లు మొదటి సెమీస్‌లోనే పోటీ పడ్డాయి. ఆ టోర్నీలో 5 విజయాలు మాత్రమే సాధించిన న్యూజిలాండ్ అతి కష్టం మీద 11 పాయింట్లతో సెమీస్ చేరింది. పైగా న్యూజిలాండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో ఎక్కువ శాత మీడియం రేంజు జట్లపైనే. ఆ టోర్నీలో కివీస్‌తో సమంగా పాయింట్లున్నప్పటికీ నెట్‌రన్ రేటు తక్కువగా ఉన్న కారణంగా పాకిస్థాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అచ్చం ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ సారి కూడా కివీస్ ఐదు విజయాలే సాధించింది. వాటిలో ఎక్కువ శాతం మీడియం రేంజు జట్లపైన వచ్చినవే. ఈ సారి కూడా పాకిస్థాన్ జట్టే ఐదో స్థానంలో ఉంది. భారత్ టాప్ ప్లేసుతో సెమీస్ చేరితే, కివీస్ అతి కష్టమ్మీద నాలుగో స్థానంతో సెమీస్ చేరింది. దీంతో వరుసాగా రెండోసారి ఇరు జట్లు మొదటి సెమీస్‌లోనే తలపడుతున్నాయి. పైగా 2019లో ఏ రోహిత్ శర్మ అయితే మైదానంలో కన్నీళ్లు కార్చడో ప్రస్తుతం అతనే టీమిండియా కెప్టెన్. అందుకే న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి నాలుగేళ్ల క్రితం నాటి ఓటమికి టీమిండియా గట్టి బదులు తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ రోజు మనల్నీ కివీస్ ఎలా ఏడిపించిందో ఈ సారి మనం కూడా వాళ్లను అలాగే ఏడిపించాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-11-15T08:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising