ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: రిషబ్ పంత్, ధోని రికార్డును బ్రేక్ చేసిన రాహుల్.. ఆ జాబితాలో కోహ్లీతో సమంగా..

ABN, Publish Date - Dec 28 , 2023 | 10:52 AM

KL Rahul: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

సెంచూరియన్: మిగతా భారత బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చి రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో అద్భుత సెంచరీతో చెలరేగిన రాహుల్ టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ సాధించాడు. రాహుల్ సెంచరీతో భారత జట్టు స్కోర్ 245 పరుగులకు చేరుకుంది. 137 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, 4 సిక్సులతో 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ పలు రికార్డులను అందుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్‌, బ్యాటర్‌గా రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోని రికార్డులను అధిగమించాడు. సౌతాఫ్రికాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. అలాగే సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.


2- సౌతాఫ్రికాలో టెస్ట్ సెంచరీ చేసిన రెండో టీమిండియా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు 2022లో కేప్‌టౌన్ టెస్ట్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు.

2- సౌతాఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్‌కు ఇది రెండో టెస్ట్ సెంచరీ. 2022 సౌతాఫ్రికా పర్యటనలో కూడా రాహుల్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో టీమిండియా బ్యాటర్‌గా విరాట్ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. ఐదు సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

7- టెస్టుల్లో విదేశాల్లో రాహుల్‌కు ఇది 7వ సెంచరీ. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న భారత బ్యాటర్లలో విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అజింక్యా రహానేతో కలిసి సమంగా ఉన్నాడు. 15 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 9 సెంచరీలు చటేశ్వర్ పుజారా ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

1- టెస్టు క్రికెట్‌లో సెంచూరియన్ మైదానంలో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. దీంతో సెంచూరియన్ మైదానంలో రెండు కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు.

101- ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 101 పరుగులతో చెలరేగాడు. దీంతో సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టీమిండియా వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 100 పరుగులు చేసిన రిషబ్ పంత్, 90 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనిని రాహుల్ అధిగమించాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కేఎల్‌ రాహుల్‌ (137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) అత్యుత్తమ శతకం నమోదు చేసినా.. బౌలర్ల వైఫల్యం దెబ్బకొట్టింది. కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌ (211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్‌) సొంతగడ్డపై సెంచరీతో చెలరేగడంతో బుధవారం ఆటలో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి టెస్ట్‌ రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సౌతాఫ్రికా 66 ఓవర్లలో 256/5 స్కోరు చేసింది. మొత్తంగా 11 పరుగుల ఆధిక్యం సాధించింది. వెలుతురు మందగించడంతో 21 ఓవర్లు ముందుగానే ఆటను నిలిపివేశారు. ఎల్గర్‌తోపాటు జెన్సన్‌ (3) క్రీజులో ఉన్నాడు. ఎల్గర్‌, బెడింగ్‌హామ్‌ (56) నాలుగో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. బుమ్రా, సిరాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

Updated Date - Dec 28 , 2023 | 10:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising