Share News

ODI World Cup: ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు.. చరిత్ర సృష్టించిన డికాక్

ABN , First Publish Date - 2023-11-10T19:27:42+05:30 IST

South Africa: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఒకవైపు బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. మరోవైపు వికెట్ కీపింగ్‌లో డికాక్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్‌లో నాలుగు సెంచరీలు చేసిన అతడు.. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు.

ODI World Cup: ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు.. చరిత్ర సృష్టించిన డికాక్

వన్డే ప్రపంచకప్‌ 2023లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఒకవైపు బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. మరోవైపు వికెట్ కీపింగ్‌లో డికాక్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్‌లో నాలుగు సెంచరీలు చేసిన అతడు.. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు డికాక్ 16 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. గతంలో 1992 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డేవిడ్ రిచర్డ్ సన్ 15 ఔట్లు చేశాడు. ఇప్పుడు అతడి రికార్డును డికాక్ తిరగరాశాడు. 1999 ప్రపంచకప్‌లో మార్క్ బౌచర్ (11), 2003 ప్రపంచకప్‌లో మార్క్ బౌచర్ (11) ఔట్లు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో కూడా డికాక్‌కు 10 ఔట్లలో భాగస్వామ్యం ఉంది.

మరోవైపు ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రికార్డును డికాక్ సమం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇబ్రహీం జార్డాన్, హష్మతుల్లా షాహిదీ, ఇక్రమ్ అఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇచ్చిన క్యాచ్‌లను డికాక్ అందుకున్నాడు. దీంతో గతంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (6), పాకిస్థాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (6) రికార్డును డికాక్ సమం చేశాడు. కాగా ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. ఆప్ఘనిస్తాన్‌ సెమీస్ ఆశలను దూరం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఉంటే ఆప్ఘనిస్తాన్‌కు అవకాశాలు ఉండేవి. అయినా ఈ మెగా టోర్నీలో ఆప్ఘనిస్తాన్ ప్రదర్శన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించడమే కాకుండా ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T19:27:43+05:30 IST