IPL Auction: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. ప్యాట్ కమిన్స్‌కు భారీ ధర
ABN , Publish Date - Dec 19 , 2023 | 02:27 PM
IPL Auction: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు. కమిన్స్ కోసం ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోటీపడి బిడ్డింగ్‌ను పెంచాయి. చివరకు సన్‌రైజర్స్ అతడిని దక్కించుకుంది. తొలుత ప్యాట్ కమిన్స్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. కమిన్స్ కనీస ధర రూ.2 కోట్లు కాగా .. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం రూ.4.8 కోట్ల వరకు బిడ్డింగ్ వేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్సీబీ రంగంలోకి దిగింది. రూ.7.8 కోట్ల వద్ద సన్‌రైజర్స్ ఎంట్రీ ఇచ్చి రూ.8.4 కోట్లకు బిడ్డింగ్ వేసింది. అక్కడి నుంచి ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోటీపడి బిడ్డింగ్‌ను రూ.20 కోట్ల వరకు తీసుకువెళ్లాయి. కాగా ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు దక్కించుకోవడంతో అతడిని కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.