ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Axar Patel: పూర్తిగా కోలుకున్న అక్షర్ పటేల్.. వరల్డ్ కప్ మిస్సైనా అక్కడ మాత్రం విధ్వంసం

ABN, First Publish Date - 2023-10-25T11:57:18+05:30

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఎంపికైనప్పటికీ అక్షర్ పటేల్‌ను దురదృష్టం వెంటాడిన సంగతి తెలిసిందే.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఎంపికైనప్పటికీ అక్షర్ పటేల్‌ను దురదృష్టం వెంటాడిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్ ప్రారంభం నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో సెలెక్టర్లు అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇక తాజాగా కోలుకున్న అక్షర్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరఫున ఆడుతున్నాడు. ఈ ట్రోఫీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 233/5 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్ అభిషేక్ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ అక్షర్ పటేల్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొదటి రెండు ఓవర్లలో అయితే 10 పరుగులే ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్ చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 3 ఫోర్లు, 4 సిక్సులతో 27 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అతనికి చిరాగ్ గాంధీ(80) కూడా సహకరించడంతో గుజరాత్ పోరాడి ఓడింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 197 పరుగులే చేసింది. గుజరాత్ ఓడినా అక్షర్ పటేల్ మాత్రం ఆకట్టుకున్నాడు. దీంతో అక్షర్ పటేల్ మళ్లీ టీమిండియాలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


కాగా ప్రపంచకప్‌లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశించిన అక్షర్ పటేల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్ నాటికి కోలుకుంటాడని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ అది సాధ్యం కాలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే అక్షర్ పటేల్‌ గాయపడడం ఇది కొత్తేం కాదు. తన కెరీర్‌లో అనేక కీలక మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమయ్యాడు. గాయాలు కనుక కాకపోయి ఉంటే ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా ఉండేవాడు. దీంతో గాయాలు అక్షర్ పటేల్‌కు శాపంగా మారుతున్నాయని చెప్పుకోవాలి. కాగా ఈ ప్రపంచకప్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గాయపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-10-25T11:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising