India vs Australia: సెంచరీ చేశాక కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూడండి!
ABN , First Publish Date - 2023-03-12T16:21:11+05:30 IST
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) మాజీ సారథి
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) పరుగుల కరువు తీర్చుకున్నాడు. మూడు సంవత్సరాల మూడు నెలల 17 రోజుల తర్వాత 100 పరుగులు బాది టెస్టుల్లో 28వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 34 ఏళ్ల కోహ్లీ ఈ మ్యాచ్(Ahmedabad Test)లో సెంచరీ చేసేందుకు 241 బంతులు ఆడాడు. సెంచరీ సాధించిన తర్వాత అప్పటి వరకు అనుభవించిన ఒత్తిడి నుంచి బయటపడ్డాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆనందాన్ని అనుభవించాడు. శతకం పూర్తిచేసుకున్న వెంటనే తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు.
నవంబరు 2019లో బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన డే-నైట్ మ్యాచ్‌లో కోహ్లీ 27వ సెంచరీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడి ఖాతాలో మరో సెంచరీ లేకుండా పోయింది. మ్యాచ్ మూడో రోజైన శనివారం అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న కోహ్లీ 13 నెలల తర్వాత ఆ మార్కుకు చేరుకున్నాడు. అంతకుముందు గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో 50కిపైగా పరుగులు చేశాడు. మళ్లీ 50 పరుగులు చేసేందుకు ఏకంగా 16 ఇన్నింగ్స్‌లు ఆగాల్సి వచ్చింది.