ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup: చరిత్ర సృష్టించిన వన్డే ప్రపంచకప్.. 48 ఏళ్లలో తొలిసారిగా..

ABN, First Publish Date - 2023-11-11T13:34:18+05:30

Cricket World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అది కూడా మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కావడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు పూర్తైంది.

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. అది కూడా మరో 6 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కావడం గమనార్హం. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు పూర్తైంది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌ను 10 లక్షలకు పైగా ప్రేక్షకులు నేరుగా మైదానానికి వెళ్లి వీక్షించడం ఇదే మొదటిసారి. దీంతో ఒక ఎడిషన్‌లో అత్యధిక మంది ప్రేక్షకులు నేరుగా మైదానానికి వెళ్లి వీక్షించిన ప్రపంచకప్ టోర్నీగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ రికార్డు ఒక వన్డే ప్రపంచకప్‌ టోర్నీలకే పరిమితం కాదు. ఇప్పటివరకు నిర్వహించిన అన్నీ ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక మంది ప్రేక్షకులు నేరుగా వీక్షించిన టోర్నీగా ఈ ప్రపంచకప్ రికార్డు నెలకొల్పింది. మొత్తంగా క్రికెట్ చరిత్రలోనే ఓ ఐసీసీ ఈవెంట్‌ను ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకులు నేరుగా మైదానానికి వెళ్లి వీక్షించడం ఇదే తొలిసారి.


లీగ్ దశ పోటీలు కూడా పూర్తవకముందే ప్రపంచకప్ టోర్నీ ఈ రికార్డును చేరుకోవడం విశేషం. టోర్నీలో కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు మిగిలి ఉండడంతో ఈ రికార్డు మరింత మెరుగపడనుంది. కాగా ఈ ప్రపంచకప్ టోర్నీ భారత్‌లోని 10 వేదికలలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఒక భారత్ మ్యాచ్‌లకే కాకుండా ఇతర మ్యాచ్‌లను చూడడానికి కూడా స్టేడియానికి తరలివస్తున్నారు. అటు డిజిటల్, శాటిలైట్ పరంగానూ వన్డే ప్రపంచకప్ వ్యూయర్‌షిప్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ వ్యూయర్‌షిప్ రికార్డులు నమోదవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో అయితే ఒకనొక దశలో 4 కోట్లకు పైగా అభిమానులు లైవ్ వీక్షించడం గమనార్హం. ఈ వ్యూయర్‌షిప్ రికార్డులను బట్టే చెప్పొచ్చు ఈ ప్రపంచకప్ ఏ స్థాయిలో విజయవంతమైందో. ఈ రికార్డుపై ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడారు. ఒక మిలియన్‌కు పైగా ప్రేక్షకుల హాజరు, రికార్డు బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌తో ఈ వరల్డ్‌కప్ అభిమానులకు వన్డే ఫార్మాట్‌పై ఉన్న మక్కువ, ఆసక్తిని తెలియచేస్తుందని పేర్కొన్నారు. తాము నాకౌట్ దశ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఈ ఈవెంట్ మరిన్ని రికార్డులను బద్దలుకొట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-11T13:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising