ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World cup: అశ్విన్ చిట్కాలతో బౌలింగ్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు ఇక చుక్కలే!

ABN, First Publish Date - 2023-10-18T09:24:35+05:30

సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలోనే గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పుణే: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలోనే గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో ఆడిన చివరి 4 వన్డే మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకంగా 3 ఓడింది. ఆసియా కప్‌లో సైతం బంగ్లా చేతిలో టీమిండియా ఓడింది. దీంతో వరల్డ్ కప్‌లో ఆ జట్టును ఏ మాత్రం తేలికగా తీసుకోకూడదని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌కు అన్ని విధాల సిద్ధమవుతోంది. మంగళవారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బుమ్రా, సిరాజ్, షమీ బౌలింగ్ చేశారు. కోహ్లీ కాస్త ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. వీళ్ల ప్రాక్టీస్ ముగిశాక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేశారు. జడేజాకు అశ్విన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. ఇందుకుగాను అతనికి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహకరించాడు. రోహిత్ స్పిన్ బౌలింగ్ చేస్తుండగా అతనికి అశ్విన్ చిట్కాలు ఇస్తూ కనిపించాడు. దీనిని బట్టి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.


నిజానికి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఈ సారి టోర్నీలో తనతోపాటు విరాట్ కోహ్లీ కూడా జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేస్తామని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే బ్యాట్‌తో అదరగొడుతున్న రోహిత్ శర్మ ఇక బౌలింగ్‌పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆఫ్‌బ్రేక్ స్పిన్నరైనా రోహిత్ శర్మ తన కెరీర్‌ను బౌలర్‌గానే ప్రారంభించాడు. ఆ తర్వాత బ్యాటర్‌గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆరంభంలో బౌలింగ్ కూడా చేసేవాడు. పలు వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత చేతి వేలికి శస్త్ర చికిత్స జరగడంతో బౌలింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రపంచకప్‌లో బౌలింగ్ చేసే అవకాశాలున్నాయి. విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ బౌలింగ్ ఎలా చేయాలో తెలిసిన బ్యాటర్ జట్టులో ఉండడం ఎల్లపుడూ మంచి చేస్తుందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మలో ఉన్న ప్రతిభ గొప్పది అని చెప్పిన అశ్విన్.. భారత్‌కు అదనపు బౌలింగ్ విషయంలో సహాయపడుతుందని అన్నాడు. అతను 3-4 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చని చెప్పాడు. బంగ్లాదేశ్ జట్టులో టాప్ 7లో నలుగురు నుంచి ఐదుగురు ఎడమ చేతి బ్యాటర్లున్నారని అశ్విన్ చెప్పాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడిన అశ్విన్‌కు ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కలేదు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా చోటు దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

టీమిండియా స్క్వాడ్

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

Updated Date - 2023-10-18T10:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising