ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Year End 2023: ఈ ఏడాది టీమిండియా అదరహో.. కోహ్లీ నుంచి షమీ వరకు మన వాళ్లు చేసిన అద్భుతాలివే!

ABN, Publish Date - Dec 28 , 2023 | 02:07 PM

Team India: 2023లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఈ ఏడాది అనేక విజయాలను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్ సాధించలేకపోయినప్పటికీ..ఈ ఏడాది చెరగని ముద్రవేసింది. విశ్వకప్‌లో వరుసగా విజయాలు సాధించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లోనూ తడాఖా చూపించింది.

2023లో టీమిండియా అద్భుతంగా ఆడింది. ఈ ఏడాది అనేక విజయాలను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్ సాధించలేకపోయినప్పటికీ..ఈ ఏడాది చెరగని ముద్రవేసింది. విశ్వకప్‌లో వరుసగా విజయాలు సాధించింది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లోనూ తడాఖా చూపించింది. అన్‌స్టాపబుల్ టీమ్‌గా ప్రశంసలు అందుకుంది. 2003 వరల్డ్‌కప్‌లో టోర్నీ మొత్తంగా భారత్ 8 విజయాలు అందుకుంది. ఈసారి ఆ రికార్డును అధిగమించింది. 2023 వరల్డ్‌కప్‌లో 10 విజయాలను సొంతం చేసుకుంది. వరల్డ్‌కప్‌ను ముద్దాడకపోయినా అదిరిపోయే ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేసింది.

సచిన్ రికార్డు బ్రేక్

2023ను విరాట్ కోహ్లీ మెమురబుల్‌గా మార్చుకున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. శతకాల పరంగా సచిన్‌ను దాటేశాడు. 49 సెంచరీలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్‌ను వెనక్కి నెట్టేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీతోనే కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ సచిన్‌ను అధిగమించాడు. మెగా ఈవెంట్‌లో కోహ్లీ ఏకంగా 765 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ సాధించిన 673 పరుగుల రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. వరల్డ్‌కప్‌ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సంచలనం సృష్టించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో వేగంగా 13 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గానూ కోహ్లీ రికార్డు అందుకున్నాడు. 267 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. 321 ఇన్నింగ్స్‌లతో సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

వికెట్ల మోత మోగించిన షమీ

2023లో భారత సీనియర్ బౌలర్ షమీ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లో పేస్ పవర్ చూపించాడు. వికెట్ల మోత మోగించాడు. తొలి నాలుగు మ్యాచుల్లో బరిలో దిగకపోయినా.. ఆ తర్వాత విజృంభించి బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. భారత జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. వరల్డ్‌కప్‌లో 24 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ రికార్డు సాధించాడు. ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఏకంగా 7 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సంచలన స్పెల్‌తో 2023ను మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. టీమిండియాకు ఈ ఏడాది సిరాజ్ కీలక బౌలర్‌గా ఎదిగాడు. శ్రీలంకలో జరిగిన ఆసియాకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టైటిల్ పోరులో లంక బ్యాటర్స్‌ను వణికించేశాడు. కొలంబోలో బంతితో విశ్వరూపమే చూపించాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే ఆలవుటైంది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్, టీమిండియా సొంతమైంది.


ఆసియా గేమ్స్‌లో స్వర్ణం

2023లో జరిగిన ఆసియా గేమ్స్‌లోనూ టీమిండియా సత్తాచాటింది. ఫేవరెట్‌గా బరిలో దిగి అంచనాలు అందుకుంది. ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించింది. నేపాల్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. వర్షం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో ఫైనల్ రద్దయ్యింది. టాప్ సీడ్‌గా బరిలో దిగిన భారత జట్టు స్వర్ణ పతకం అందుకుంది. చైనా గడ్డ మీద చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసలు అందుకున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో నిరాశే ఎదురైనప్పటికీ.. ఈ ఏడాది ఆసీస్‌పై భారత్ చెలరేగింది. స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించింది. టెస్ట్‌ల్లో ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. వరుసగా నాలుగోసారి కంగారూలను ఓడించింది. గత 30 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాను వరుసగా నాలుగు టెస్ట్‌ సిరీసుల్లో ఓడించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డును అందుకుంది.

ప్రత్యేక ఆకర్శణగా జైస్వాల్

2023లో యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన ముద్రవేశాడు. వెస్టిండీస్ గడ్డ మీదే యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఎంట్రీతోనే సెంచరీ సాధించాడు. విదేశీ గడ్డపై అరంగేట్రంతోనే శతకం కొట్టిన భారత ఓపెనర్‌గా రికార్డు సాధించాడు. రోసోలో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 171 పరుగులు సాధించాడు. ఈ ఏడాది వచ్చిన అవకాశాలను ఈ యువ ప్లేయర్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఫ్యూచర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ 2023ను మెమొరబుల్‌గా మార్చుకున్నాడు. పరుగుల రేసులో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఓ వెలుగు వెలిగాడు. 2023లో 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గానూ గిల్ రికార్డుల్లో నిలిచాడు. 29 వన్డేల్లో 1,584 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ కూడా ఇదే ఏడాది సాధించాడు. వన్డేల్లో 5 సెంచరీలు కొట్టాడు. టెస్ట్‌ల్లోనూ ఒక సెంచరీ సాధించాడు. టీ-ట్వంటీల్లోకి 2023లోనే అరంగేట్రం చేశాడు. శతకం కూడా సాధించాడు.

ఈ ఏడాది టీ-ట్వంటీల్లో టీమిండియా ప్రపంచ రికార్డును సాధించింది. టీ-ట్వంటీల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 138 విజయాలతో పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. టీ-ట్వంటీల్లో పాక్ జట్టు 135 విజయాలు సాధించింది. టీమిండియా 138 మ్యాచుల్లో గెలిచింది. అయితే ఈ ఏడాది విశ్వకప్ కల చెదిరినా..జట్టుగా మాత్రం భారత్ ఆకట్టుకుంది.

Updated Date - Dec 28 , 2023 | 02:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising