Cummins : కమిన్స్‌కు మాతృవియోగం
ABN , First Publish Date - 2023-03-11T00:21:43+05:30 IST
అనారోగ్యంతో బాధపడుతున్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా శుక్రవారం తెల్లవారుఝామున మరణించింది. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా శుక్రవారం తెల్లవారుఝామున మరణించింది. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. మారియా మరణవార్తను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ట్వీట్ చేసింది. తల్లి బాగోగులు చూసుకునేందుకే కమిన్స్.. భారత్‌తో రెండు టెస్టులు ఆడాక స్వదేశానికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. మరోవైపు మరియాకు నివాళిగా రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాళ్లు తమ చేతికి నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు. బీసీసీఐ కూడా సంతాపాన్ని ప్రకటించింది.