Kohli-Anushka: కోహ్లీ క్యాచ్.. అనుష్క షాక్.. వదినమ్మను బాధపెట్టారు కదరా..
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:21 PM
Glenn Phillips: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ షాక్‌కు గురైంది. కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక్క క్యాచ్‌తో అందర్నీ విస్మయానికి గురిచేశాడు. అప్పటివరకు ఫుల్ జోష్‌లో ఉన్న అనుష్క కూడా ఇది చూసి తల మీద చేతులు వేసుకోక తప్పలేదు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ అప్పుడప్పుడూ క్రికెట్ గ్రౌండ్స్‌లో సందడి చేస్తుంటుంది. టీమిండియా ఆడే ముఖ్యమైన మ్యాచులకు హాజరవుతూ విరాట్‌ను ఆమె ఎంకరేజ్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ మధ్య మ్యాచులకు రావడం తగ్గించిన అనుష్క.. ఎప్పుడో ఓసారి గానీ స్టేడియాలకు రావడం లేదు. అలాంటిది చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం దుబాయ్‌లో ఆమె వాలిపోయింది. భర్తను ఎంకరేజ్ చేస్తూ ఆమె స్టేడియంలో సందడి చేసింది. కానీ ఒక్క క్యాచ్‌తో ఆమె ముఖం వాడిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
బాధ తట్టుకోలేక..
కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగగానే స్టేడియం దద్దరిల్లింది. విరాట్.. విరాట్ అంటూ అభిమానులు ఈలలు, కేకలతో గోలగోల చేశారు. స్టాండ్స్‌లో ఉన్న అనుష్క కూడా భర్తను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. అతడు వచ్చీ రాగానే రెండు ఫోర్లు కొట్టడంతో ఆమెలో జోష్ మరింత పెరిగింది. అయితే మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కోహ్లీ ఆఫ్ సైడ్ కొట్టిన బంతిని ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా ఒడిసిపట్టుకోవడంతో అనుష్క డల్ అయిపోయింది. బౌండరీ ఖాయం అనుకున్న బంతిని అతడు పక్షిలా ఎగిరి పట్టుకోవడంతో ఇలా జరిగిందేంటి అంటూ తల మీద చేతులు పెట్టుకుంది అనుష్క. గ్రౌండ్‌లో కోహ్లీ, స్టాండ్స్‌లో ఉన్న అనుష్క ఇద్దరూ ఆ క్యాచ్‌కు షాక్ అయ్యారు. అక్కడి నుంచి కొద్దిసేపు వరకు ఆమె అందులో నుంచి కోలుకోలేదు. ఇది చూసిన నెటిజన్స్.. వదినమ్మను బాధపెట్టారు కదరా అంటూ కివీస్ ప్లేయర్లపై సీరియస్ అవుతున్నారు. మిమ్మల్ని వదిలేది లేదు.. మ్యాచ్ గెలిచి తడాఖా చూపిస్తామని కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి