Virat Kohli: కోహ్లీనే బిత్తరపోయేలా చేశాడు.. వీడు మనిషా.. పక్షా..
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:00 PM
Glenn Phillips: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బిత్తరపోయేలా చేశాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్. స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఈ క్యాచ్ ఎలా పట్టాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు ప్రత్యర్థులు. ఎందుకంటే ఎన్ని వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించుకుంటూ పరుగులు చేస్తుంటాడు కింగ్. ఎంత మంది ఫీల్డర్లను మోహరించినా సందుల్లో నుంచి బంతుల్ని తరలిస్తూ తన పని తాను చేసుకుపోతాడు. ఫీల్డింగ్ పొజిషన్స్ చూసుకునే షాట్లను ఎంపిక చేసుకుంటాడు. అయితే కోహ్లీకి ఓ ఆటగాడు షాక్ ఇచ్చాడు. అతడ్ని దాటేసి బంతి వెళ్లిపోతుందని విరాట్ ధీమాగా ఉండగా.. మెరుపు వేగంతో అమాంతం పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టేశాడు. దీంతో కింగ్ బిత్తరపోయాడు. ఇది భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
సైంధవుడిలా అడ్డుపడి..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కివీస్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది. 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ (15), శుబ్‌మన్ గిల్ (2) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (11) ఆదుకుంటాడేమో అనుకుంటే అతడూ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే రోహిత్-గిల్ స్వీయ తప్పిదాలతో ఔట్ అయినా.. కోహ్లీ వికెట్ మాత్రం ఓ ఫీల్డర్ మెరుపు విన్యాసం వల్లే పోయింది. అతడే గ్లెన్ ఫిలిప్స్. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌లో పడిన బంతిని గట్టిగా కొట్టాడు విరాట్. బంతి బౌండరీ లైన్ దాటడం ఖాయమని అనుకున్నాడు. కానీ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ఫిలిప్స్ సైంధవుడిలా మధ్యలోనే అడ్డుపడ్డాడు. బాడీని ఫుల్ స్ట్రెచ్ చేసి గాల్లో ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. వేగంగా వెళ్తున్న బంతిని పక్కాగా అంచనా వేసి రెప్పపాటులో దూకి పట్టుకున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి