ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Emerging Asia Cup Final: పాకిస్థాన్ బ్యాటర్ల ఊచకోత.. భారత్ ముందు భారీ లక్ష్యం

ABN, First Publish Date - 2023-07-23T18:13:24+05:30

ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-ఏ ముందు పాకిస్థాన్-ఏ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తయ్యబ్ తాహిర్(108) సెంచరీతో ఊచకోత కోయడానికి తోడు సాహిబ్జాదా ఫర్హాన్(65), సైమ్ అయూబ్ (59) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 352/8 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-ఏ ముందు పాకిస్థాన్-ఏ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తయ్యబ్ తాహిర్(108) సెంచరీతో ఊచకోత కోయడానికి తోడు సాహిబ్జాదా ఫర్హాన్(65), సైమ్ అయూబ్ (59) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 352/8 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో టీమిండియా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కనీసం ఒక్క బౌలర్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ తొలి వికెట్‌కు సెంచరీ పాట్నర్‌షిప్‌ను నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రన్‌రేటు 6కు తగ్గకుండా పరుగులు రాబట్టారు. ఓపెనింగ్ జోడిని త్వరగా ఔట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.


ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్లో స్పిన్నర్ మానవ్ సుతార్ విడదీశాడు. 7 ఫోర్లు, 2 సిక్సులతో 51 బంతుల్లోనే 59 పరుగులు చేసిన సైమ్ అయూబ్.. ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 121 పరుగుల వద్ద పాకిస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 4 ఫోర్లు, 4 సిక్సులతో 62 బంతుల్లోనే 65 పరుగులు చేసిన సాహిబ్జాదా ఫర్హాన్ రనౌట్ అయ్యాడు. కాసేపయ్యాక 28వ ఓవర్ మొదటి రెండు బంతులకు స్పిన్నర్ రియాన్ పరాగ్.. ఒమైర్ యూసుఫ్(35), ఖాసిం అక్రమ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఖాసిం అక్రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ కాసేటికే కెప్టెన్ మహ్మద్ హరీస్‌(2) కూడా ఔటవడంతో 187 పరుగులకే పాకిస్థాన్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చినట్టే కనిపించింది. కానీ భారత్ ఆశలపై తయ్యబ్ తాహిర్ నీళ్లు చల్లాడు. ముబాసిర్ ఖాన్(35)తో కలిసి ఆరో వికెట్‌కు 97 బంతుల్లోనే 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఈ క్రమంలో పాక్ స్కోర్ 300 దాటింది. టీ20 స్టైల్‌లో రెచ్చిపోయిన తయ్యబ్ తాహిర్ 66 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసిన కాసేపటికే పేసర్ రాజవర్ధన్ హంగర్గేకర్ ఔట్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏకంగా 152 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన తాహిర్ 12 ఫోర్లు, 4 సిక్సులతో 71 బంతుల్లోనే 108 పరుగులు బాదేశాడు. పాక్ మిడిలార్డర్ బ్యాటర్లు కూడా రాణించడంతో స్కోర్ ఏకంగా 350 పరుగులు దాటింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో హంగర్గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు.. హర్షిత్ రానా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీశారు. భారత బౌలర్లలో ఒక్క నిశాంత్ సింధు తప్ప మిగతావారంతా 6కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు.

Updated Date - 2023-07-23T18:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising