Ravi Shastri : 8 గంటలా.. కుర్రాళ్లకు కష్టమే
ABN , First Publish Date - 2023-11-15T03:52:40+05:30 IST
వన్డేల భవిష్యత్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమయానుకూలంగా వన్డే ఫార్మాట్‌లో కూడా తగిన మార్పులు రావాలని సూచించాడు. 8 గంటలపాటు ..

వన్డే ఫార్మాట్ మారాలి: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: వన్డేల భవిష్యత్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమయానుకూలంగా వన్డే ఫార్మాట్‌లో కూడా తగిన మార్పులు రావాలని సూచించాడు. 8 గంటలపాటు మ్యాచ్‌ను చూసే సమయం నేటి యువతకు లేదన్నాడు. ‘ఇప్పటి తరానికి ఎక్కువ సమయం ఆటపైనే ధ్యాసపెట్టడం కష్టం. వన్డేలు 40 ఓవర్ల మ్యాచ్‌లుగా మారితే.. కొంతలో కొంత ఈ ఫార్మాట్ బతికే అవకాశాలున్నాయి. టాస్ ఎవరు గెలిచారో చూసిన తర్వాత.. తమ అభిమాన జట్టు బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియాలకు వస్తున్నారు. ఒకవేళ భారత్ ఛేదిస్తుంటే..నేనైతే సాయం త్రం 5 గంటలకు స్టేడియానికి వస్తా’ అని శాస్ర్తి చెప్పాడు.