IND vs AUS: ఇందుకు కదూ సూర్యను ప్రపంచకప్‌నకు ఎంపిక చేసింది.. ప్రత్యర్థులకు ఇక పీడకలలే!
ABN, First Publish Date - 2023-09-24T19:35:46+05:30
సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంతకాలం తన 360 డిగ్రీస్ ఆట అంతా టీ20లకే పరిమితం చేసిన సూర్య తాజాగా వన్డేల్లోనూ చెలరేగుతున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇండోర్: సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంతకాలం తన 360 డిగ్రీస్ ఆట అంతా టీ20లకే పరిమితం చేసిన సూర్య తాజాగా వన్డేల్లోనూ చెలరేగుతున్నాడు. వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో తాజాగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనైతే పెను విధ్వంసమే సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్‌లో అయితే ఏకంగా వరుసగా 4 సిక్సులు బాదాడు. ఈ క్రమంలో వన్డేల్లో రోహిత్ శర్మ తర్వాత ఒకే ఓవర్‌లో 4 సిక్సులు బాదిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో రెచ్చిపోయిన సూర్య 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 37 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్య ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు, 6 ఫోర్లున్నాయి. గత మార్చిలో ఇదే ఆస్ట్రేలియాపై వరుసగా 3 వన్డేల్లో డకౌటైన సూర్య ఈ సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం.
కాగా సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతనికి మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డేల్లో రాణించలేకపోతున్నప్పటికీ ఏకంగా ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్య కూడా టీ20ల్లో అదరగొడుతున్నా వన్డేల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వచ్చాడు. అయితే సూర్య ఎంపికపై వస్తున్న విమర్శలకు టీమ్ మేనేజ్‌మెంట్ పలు మార్లు వివరణ కూడా ఇచ్చింది. సూర్యకు మద్దతుగా నిలిచింది. సూర్య తన స్టైల్‌లోనే ఆడితే డెత్ ఓవర్లలో టీమిండియాకు వీలైనన్నీ ఎక్కువ పరుగులొస్తాయని చెప్పుకొచ్చింది. అందుకే సూర్యను 5 లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలిపింది. కాగా సూర్య టీ20ల్లో ఎంత వేగంగా పరుగులు రాబడతాడో మనం ఇది వరకే చాలా సార్లు చూశాం. పైగా ప్రస్తుతం అతను టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కూడా ఉన్నాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో సూర్య ఆశించినట్టుగా రాణిస్తే డెత్ ఓవర్లలో భారత్‌కు తిరుగుండదు. అయితే తాజాగా సూర్య అదే చేసి చూపించాడు. దీంతో ప్రపంచకప్‌నకు ముందు ప్రత్యర్థులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని అభిమానులు చెబుతున్నారు. సూర్య కారణంగా వారికి ఇంకా ప్రతి రోజు రాత్రి పీడకలలే అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సూర్యను ప్రపంచకప్‌నకు ఎంపిక చేసింది ఇందుకే అంటున్నారు. ఏది ఏమైనా ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తే భారత్‌కు తిరుగుండకపోవచ్చు.
Updated Date - 2023-09-24T19:35:46+05:30 IST