ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shreyas Iyer: వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ ప్లేయర్!

ABN, First Publish Date - 2023-09-12T15:49:52+05:30

2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను గాయాలు ఇంకా కలవరపెడుతున్నాయి. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు కూడా లేదు.

కొలంబో: 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను గాయాలు ఇంకా కలవరపెడుతున్నాయి. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు కూడా లేదు. కానీ టీమిండియా ఆటగాళ్లు ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఇంకా కోలుకోలేదు. గాయంతో నేడు శ్రీలంకతో మ్యాచ్‌కు కూడా శ్రేయస్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కానీ వెన్ను నొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని వెల్లడించింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, అతడికి వైద్య బృందం విశ్రాంతి ఇచ్చినట్టు పేర్కొంది. దీంతో శ్రీలంకతో మ్యాచ్ కోసం టీమిండియాతో కలిసి శ్రేయస్ అయ్యర్ స్టేడియానికి వెళ్లలేదని బీసీసీఐ తెలిపింది. నివేదికల ప్రకారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్మప్ సమయంలో శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి తిరగబెట్టింది. దీంతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. టాస్‌ వేయడానికి 5 నిమిషాల ముందు రాహుల్‌ను తుది జట్టులో చేర్చారు. అయితే ఆసియా కప్‌లోని మిగతా మ్యాచ్‌ల సమయానికి శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తోంది.


కాగా వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ 6 నెలలపాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 వంటి కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వేసవిలో లండన్ వెళ్లి వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో కోలుకున్నాడు. ఆసియా కప్‌లోనే జట్టులో చేరాడు. వన్డే ప్రపంచకప్‌నకు కూడా ఎంపికయ్యాడు. ఆసియా కప్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. దీంతో శ్రేయస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని అంతా భావించారు. కానీ ఇంతలోనే వెన్ను నొప్పి తిరగబెట్టింది. కాగా గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఇటీవలనే కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు ఆసియా కప్‌లో అదరగొడుతున్నారు. కానీ శ్రేయస్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం కలవరపరిచే అంశం.

Updated Date - 2023-09-12T15:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising