Virat Kohli: ధోని రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
ABN, First Publish Date - 2023-07-15T19:07:38+05:30
డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా గెలిచిన అత్యధిక మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్న రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా గెలిచిన 295 మ్యాచ్‌ల్లో భాగమైన ధోనిని అధిగమించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియా గెలిచిన 296 మ్యాచ్‌ల్లో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ ఏకంగా భారత జట్టు గెలిచిన 307 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. అయితే ప్రస్తుతానికి సచిన్‌కు కోహ్లీకి మధ్య 11 మ్యాచ్‌లే తేడా ఉన్నాయి. దీంతో విరాట్ కోహ్లీ భవిష్యత్‌లో సచిన్‌ను కూడా అధిగమించే అవకాశాలున్నాయి.
ఇక తన కెరీర్లో సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌లు ఆడగా.. ధోనీ 538 మ్యాచ్‌లు ఆడాడు. కింగ్ కోహ్లీ 499 మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఈ నెల 20 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ (West Indies vs India 2nd Test) ద్వారా విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌లను పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా 500 మ్యాచ్‌లు ఆడిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. ఇక 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 110 టెస్ట్‌లు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 8,555, వన్డేల్లో 12,898, టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 53 సగటుతో 25,461 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 75 సెంచరీలున్నాయి.
Updated Date - 2023-07-15T19:09:18+05:30 IST