Hockey Pro League : జర్మనీకి భారత్‌ షాక్‌

ABN , First Publish Date - 2023-03-11T00:20:35+05:30 IST

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ అద్భుత బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 3-2 గోల్స్‌

Hockey Pro League : జర్మనీకి భారత్‌ షాక్‌

హాకీ ప్రొ లీగ్‌

రూర్కెలా: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో భారత్‌ అద్భుత బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 3-2 గోల్స్‌ తేడాతో ప్రపంచ చాంపియన్‌ జర్మనీకి షాకిచ్చింది. యువ ఆటగాడు సుఖ్‌జీత్‌ (31వ, 42వ) రెండు గోల్స్‌ సాధించి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో గోల్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ) చేశాడు. జర్మనీ తరఫున ఫిలిప్‌ (44వ), మైకేల్‌ (57వ) చెరో గోల్‌ కొట్టారు. భారత్‌ తన రెండో మ్యాచ్‌ను ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Updated Date - 2023-03-11T00:20:40+05:30 IST